E-Paper
Advertisement

Protest in Iran: సంక్షోభంలో ఇరాన్.. వీధుల్లోకి ప్రజలు.. తారాస్థాయికి ఉద్రిక్తతలు

Protest in Iran: సంక్షోభంలో ఇరాన్.. వీధుల్లోకి ప్రజలు.. తారాస్థాయికి ఉద్రిక్తతలు
Advertisement

Protest in Iran: ఇరాన్‌లో నిరసనల ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో.. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పెరిగిన ధరలకు తోడు, కరెన్సీ పతనం ఇరాన్‌కు కుదిపేస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. దాదాపు ఏడుగురు మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన సభ్యుడు కూడా ఉన్నాడు.

మొదట రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనలు మొదలవ్వగా.. ఇప్పుడు ఇరాన్ అంతటా చేరుకున్నాయి. ఎక్కువగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఉండే నగరాలైన అజ్నా, లోర్డెగాన్, కుహ్‌దాస్త్‌ల్లో ఉద్రిక్తతలు మిన్నంటాయి. ఆందోళనలు తీవ్రం అవుతుండటంతో.. కొన్ని చోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్పందించారు. నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు, ర్యాలీలు చేస్తున్నారు.

Advertisement

ఇదే టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఆందోళన కారులను కాల్చి చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా సైన్యం ఇరాన్‌కు వచ్చేందుకు సిద్ధంటూ ఉందంటూ హెచ్చరించారు.

ఈ క్రమంలో ఇరాన్ కూడా ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాజా వరకు.. అమెరికా హిస్టరీని ఇరాన్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అమెరికా సాకులతో ఇరాన్ భద్రత విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందనని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలా జరిగితే ప్రశ్చాత్తాపడే పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ జాతీయ భద్రత ఓ రెడ్ లైన్ అని.. ఇది సాహసోపేతమైన ట్వీట్లకు సంబంధించిన విషయం కాదంటూ ట్వీట్‌లో ట్రంప్‌ను హెచ్చరించారు.

Advertisement

ALSO READ: Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×