E-Paper
Advertisement

Iran Permission: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్, ఇండియా షిప్‌లకు అనుమతి

Iran Permission: దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్, ఇండియా షిప్‌లకు అనుమతి
Advertisement

Iran Permission: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఆసియాకు కీలకంగా మారింది హార్ముజ్ జలసంధి. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్‌తో జలసంధి దాటేందుకు నౌకలు ప్రయత్నాలు చేయలేదు. దీని కారణంగా ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు. తాజాగా భారత్ విదేశాంగ శాఖ చేసిన చర్చలతో ఇరాక్ కాస్త మెత్తబడింది. ఫలితంగా భారత్ కి చెందిన రెండు షిప్‌లకు అనుమతి ఇచ్చింది.

ఇండియా దౌత్యం ఫలించింది.. ఇరాన్ గ్రీన్‌ సిగ్నల్

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత కీలకమైంది హార్ముజ్ జలసంధి. గల్ఫ్ నుంచి ఆసియా వైపు ఏ నౌకలు వెళ్లాలన్నా కచ్చితంగా పెర్షియన్ గల్ఫ్‌-ఒమన్ గల్ఫ్‌తో కలిపే ఇరుకైన జలసంధిని దాటాల్సిందే.  వార్ జఠిలమైన నేపథ్యంలో ఆ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నౌకలను రానిచ్చేది లేదని తేల్చేసింది. కాదని మొండి కేస్తే పేల్చేస్తామని హెచ్చరించింది.

ఫలితంగా దాదాపు వందల నౌకలు పెర్షియన్ గల్ఫ, అటు ఒమన్ గల్ఫ్ తీరంలో ఆగిపోయాయి. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని రెండు నౌకలు బుధవారం జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తుండగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దాడి చేశాయి. ఫలితంగా షిప్‌లు డ్యామేజ్ అయ్యాయి.

Advertisement

ముంబై తీరానికి  రెండు ఆయిల్ షిప్‌లు

గడిచిన పది రోజులుగా పరిస్థితి గమనించింది భారత్. దీంతో మంగళవారం రాత్రి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చితో చర్చలు జరిపారు.  దీని ఫలితంగా భారత్‌కు చిన్న ఉపశమనం లభించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ జెండాతో ఉన్న నౌకలు ఈ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు అనుమతించినట్లు సమాచారం.

పుష్పక్, పరిమళ్ పేరిట ఉన్న రెండు ఇండియన్‌ ట్యాంకర్లు హర్మూజ్‌ జలసంధి దాటినట్లు తెలిపాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు అక్కడే ఉండిపోయాయి. యుద్ధం ప్రారంభమైన నుంచి జైశంకర్‌-అరాగ్చీల మధ్య మూడుసార్లు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మంగళవారం హర్మూజ్‌ నుంచి ట్యాంకర్లు గమ్యస్థానానికి చేరడంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.ఆ తర్వాత ఇరాన్ ఓకే చెప్పింది.  దీంతో రెండు నౌకలు వచ్చాయి. దీంతో భారత్‌కు కొంత రిలీఫ్ దక్కింది.

ALSO READ: ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు తదుపరి లక్ష్యం

ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్రం మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం గుండా ప్రతిరోజూ 20 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడిచమురు వివిధ దేశాలకు వెళ్తుంది. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదో వంతు కూడా. సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు పావు వంతుకు సమానం. సహజ వాయువు రవాణాలో అధిక భాగం ఈ కారిడార్ ద్వారానే వెళ్తుంది.

ఈ జలసంధి ద్వారా రవాణాకు ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, షిప్పింగ్ మార్గాలను ప్రభావితం చేస్తుంది. భారత షిప్పింగ్ శాఖకు చెందిన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారత జెండాతో కూడిన నౌకలు పని చేస్తున్నాయి. వీటిలో 24 నౌకలు హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్నాయి. నాలుగు నౌకలు జలసంధికి తూర్పున  ఉంటాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×