E-Paper
Advertisement

Dubai International Airport: మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు.. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి, ఆలస్యంగా ఫుటేజ్

Dubai International Airport: మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు.. ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి, ఆలస్యంగా ఫుటేజ్
Advertisement

Dubai International Airport: ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకింది. ఫలితంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విమాన కార్యకలాపాలు గంటల తరబడి నిలిచిపోయాయి. దాదాపు 6 గంటల పాటు తర్వాత విమానాశ్రయంలో విమానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అసలు ఏం జరిగింది?

మంటల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు

Advertisement

సోమవారం తెల్లవారుజామున దుబాయి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఇంధన ట్యాంక్‌పై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వివిధ దేశాల నుంచి దుబాయ్ కి వచ్చే విమానాలు ఎక్కడికక్కడి నిలిచిపోయాయి. కొన్నింటిని రద్దు చేసుకున్నాయి సంబంధిత ఎయిర్ లైన్స్ సంస్థలు.

భారీగా ఎగసిపడిన మంటల కారణంగా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరం అంతటా దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే రంగంలోకి దిగిన  దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు గంటల కొద్దీ శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయంతో హడలిపోయారు.

Advertisement

ఇంధన ట్యాంక్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఆలస్యంగా బయటకు ఫుటేజ్

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దుబాయ్ కూడా ఒకటి. దీనికి సంబంధించి ఆలస్యంగా ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత ప్రయాణికులు ఎయిర్‌పోర్టు వైపు రావడానికి ఇష్టపడలేదు.  అంతేకాదు దుబాయ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఓడ రేవులు, ఎయిర్ పోర్టులను అమెరికా రహస్య స్థావరాలను ఉపయోగించుకుంటోందని ఇరాన్ ఆరోపించింది. ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత ఇరాన్ దాడికి దిగింది. యూఎస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని యుఏఈలోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని టెహ్రాన్ పిలుపు నిచ్చింది కూడా. డ్రోన్ ఘటనకు బాధ్యులు ఎవరన్న విషయంలో యూఏఈ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దీని వెనుక ఇరాన్ ఉండొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా వార్తలు వస్తున్నాయి.

ALSO READ: కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ దాడులు.. 400 మందిని లేపేసింది

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×