// //
Iran Drone Hits Dubai: ఇరాన్‌పై అమెరికా తన దాడి తీవ్రతరం చేసిందా? ఓవైపు వార్ షిప్‌లు.. ఇంకోవైపు భారీ యుద్ధ విమానాలను రంగంలోకి దించిందా? శనివారం రాత్రి ఏం జరిగింది? ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగు దేశాలకు ఇచ్చిన మాట ఇరాన్ ఎందుకు తప్పింది? తాజాగా దుబాయ్‌లోని మెరీనా టవర్స్ పై డ్రోన్ దాడి జరగడం వెనుక అసలు కథేంటి?
మాట తప్పిన ఇరాన్.. పొరుగు దేశాలపై దూసుకెళ్లిన డ్రోన్లు, మిస్సైళ్లు
పొరుగు దేశాలకు ఇరాన్ ఇచ్చిన మాట తప్పింది. ఫలితంగా దుబాయ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, అజర్ బైజాన్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి డ్రోన్లు, మిస్సైళ్ల దాడి జరిగింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి.
శనివారం రాత్రి ఇరానియన్ డ్రోన్లు దుబాయ్‌లోని 23 మెరీనా టవర్స్‌ని తాకాయి. ఈ దాడిలో టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుబాయ్ మెరీనా వాటర్ ఫ్రంట్ ప్రాంతంలో ఆకాశహర్మ్యంపై జరిగిన దాడి జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి దట్టమైన పొగ కనిపించింది. భవనం పైనుండి పొగలు ఎగసిపడుతున్న వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దుబాయ్‌లోని మెరీనా టవర్స్‌ని తాకిన డ్రోన్లు, ఆపై మంటలు
నష్టం జరిగిందనే దాని గురించి అధికారులు ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. పైనుండి వచ్చిన డ్రోన్ల ముప్పును వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ మెరీనాలోని ఒక టవర్‌లో కొంతబాగం దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. డ్రోన్లను అడ్డగించడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వుందని ఎవరూ గాయపడలేదని పేర్కొంది.
సంపన్నులు, ప్రవాసులు, అంతర్జాతీయ నిపుణులు, విదేశీ పెట్టుబడిదారులకు కేరాప్ లగ్జరీ టవర్. 90 అంతస్తుల లగ్జరీ టవర్ నుంచి ప్రజలు అత్యవసర సిబ్బంది పాక్షికంగా ఖాళీ చేయించి మరొక చోటుకి తరలించినట్టు తెలుస్తోంది. టెహ్రాన్‌పై పొరుగు దేశాలు దాడి చేస్తే తప్ప.. తాము దాడులకు పాల్పడబోమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలో ఈ దాడి జరిగింది.
ALSO READ: గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. దాడులు చేస్తూ సారీ ఏంటో?
ఇరాన్ ప్రయోగించిన క్షిపణి శకలాలు దుబాయ్‌లోని ఓ కారుపై పడ్డాయి. దుబాయ్ సిటీలోని అత్యంత రద్దీ ప్రాంతం అల్ బర్షా ఏరియా. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ వైమానిక వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఆకాశంలో పేల్చివేయడంతో క్షిపణికి చెందిన భారీ శకలం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న పాకిస్థానీయుడు ప్రాణాలు కోల్పోయాడు.
An Iranian drone reportedly struck the 23 Marina tower in Dubai, UAE. pic.twitter.com/jtIJFAwpGI
— Clash Report (@clashreport) March 7, 2026