E-Paper
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఎక్కడ? రష్యాలో లేడన్న ఇరాన్, వేటాడుతాం..

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఎక్కడ? రష్యాలో లేడన్న ఇరాన్, వేటాడుతాం..
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ఎక్కడ? అతడిపై ఎందుకు రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి? రష్యాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారా? లేక ఇరాన్‌లో మూడో కంటికి కనిపించని ప్రాంతంలో ఉన్నారా? ఎక్కడున్నా వెంటాడి చంపుతామని ఇజ్రాయెల్ ప్రకటన వెనుక ఏం జరుగుతోంది.

ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ కోసం వేట

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ తొలిరోజు దాడుల్లో ఇరాన్ టాప్ లీడర్ అంతా హతమయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ ద్వితీయ శ్రేణి నాయకత్వం వార్ జోన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు రెండువారాలపాటు రకరకాలుగా అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. అలాగే టెల్ అవీవ్‌లో మిస్సైళ్లు వర్షం కురిసింది.

టెహ్రాన్‌లోని కీలక స్థావరాలపై మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా కొత్తగా నియమితులైన ఇరాన్ నాయకత్వంలోని చాలామంది హతమయ్యాయి. ఎటు చూసినా కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ మాత్రమే ఉన్నాడు. రీసెంట్‌గా ఇరాన్ దేశ ఛానెల్లో ఆయన మాట్లాడాడు. కానీ ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు.

Advertisement

ఖమేనీ రష్యాలో లేడన్న ఇరాన్.. వెంటాడుతామన్న ఇజ్రాయెల్

ఫలితంగా మొజ్తబా కోసం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గురించి రకరకాల వార్తలు జోరందుకున్నాయి. తొలి యుద్ధం తర్వాత ట్రీట్‌మెంట్ కోసం మొజ్తబా ఖమేనీ రష్యాకు వెళ్లాడంటూ మంగళవారం ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై ఇరాన్‌ రియాక్ట్ అయ్యింది. రష్యాలో ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు రష్యాలో ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ.

రష్యాలో ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు రష్యాలో ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ. ఇదొక మానసిక యుద్ధమని అన్నారు. ఇరాన్ నేతలు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. వాళ్లు ప్రజల మధ్యనే ఉంటారని ఎక్స్‌లో ప్రస్తావించారు.

ALSO READ: త్వరలో ఇరాన్‌ యుద్ధం ఎండ్.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు, సహకరించని మిత్రులు

యుద్ధం మొదలైన నుంచి మొజ్తబా ఎక్కడా కనిపించలేదు. ఈ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడినట్టు అమెరికా తెలిపింది. ఆ తర్వాత కేవలం ఆడియో ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అయ్యింది. ఇరాన్ కొత్త నాయకుడు మొజ్తబా ఖమేనీ సహా మా దేశానికి ముప్పు కలిగించేవారిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకుంటాయని సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.

ప్రస్తుతం ఖమేనీ ఆచూకీ గురించి ఇజ్రాయెల్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. అల్ జజీరా ఛానెల్ ప్రకారం.. ఖమేనీ ఆచూకీ గురించి అడిగినప్పుడు ఐడీఎఫ్ వద్ద నిర్దిష్ట సమాచారం ఏమీ లేదన్నారు. ఇజ్రాయెల్ తన శత్రువులను వెంబడించడం కొనసాగిస్తుందని డెఫ్రిన్ హెచ్చరించారు. మా నుండి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. వారిని వెంబడిస్తామని, నిర్వీర్యం చేస్తామని చెప్పుకొచ్చారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×