// // Strait of Hormuz Closed: ఇరాన్‌పై అమెరికా దాడులు, హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ -->
E-Paper
Advertisement

Strait of Hormuz Closed: యుద్ధం తీవ్రతరం.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు, హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్

Strait of Hormuz Closed: యుద్ధం తీవ్రతరం.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు, హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్
Advertisement

Strait of Hormuz Closed: పశ్చిమాసియాలో యుద్ధం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్-ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో శనివారం రాత్రి ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. పరిస్థితి గమనించిన ఇరాన్, హార్ముజ్ జలసంధిని మూసివేసింది.

ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు-ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ దాడులు మొదలయ్యాయి. గడిచిన రెండు రోజులుగా అమెరికా-ఇరాన్ సైనిక స్థావరాలపై గురిపెట్టాయి. వాణిజ్య నౌకపై దాడి జరిగిన తర్వాత హోర్ముజ్ జలసంధిని మరోసారి మూసి వేసినట్లు టెహ్రాన్ ప్రకటన చేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి  ఇరాన్‌పై అమెరికా మరో విడత దాడులు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత దెబ్బతీశాయి.

Advertisement

హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్-ఇరాన్‌పై తాము దాడి చేయడం ఈ వారంలో ఇది మూడోదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. బందర్ అబ్బాస్, ఖేస్మ్ ఐలాండ్, సిరిక్ లాంటి ప్రాంతాలలో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఈ విషయాన్ని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో  మిగతా దేశాలపై ఇరాన్ దాడులకు దిగే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశముంది. ఇరాన్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికి అమెరికా దళాలు మూడో విడత దాడులు మొదలుపెట్టినట్టు యూఎస్ సెంట్రల్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులు చేయకుండా అవగాహన ఒప్పందానికి వచ్చాయి. ఇరాన్‌కు మరో అవకాశం ఇచ్చినా అది మళ్ళీ విఫలమైందని అమెరికా సైన్యం పేర్కొంది.

Advertisement

దాడులకు ముందు ఇరాన్ ఏం చెప్పింది?అమెరికా దాడులకు కొన్ని గంటల ముందు అనధికారిక మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై కాల్పులు జరిపినట్లు పేర్కొంది ఇరాన్. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మరోసారి మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు జలమార్గం గుండా నౌకలు ప్రయాణించడానికి ఐఆర్‌జిసి నేవీ విభాగం అనుమతించదని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది.

ALSO READ: వియత్నాంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో బోటు బోల్తా, 18 మంది టూరిస్టులు మృతి

జరుగుతున్న పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రియాక్ట్ అయ్యారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ తన చమురు అమ్ముకోవడానికి మినహాయింపులను అమెరికా ఏకపక్షంగా రద్దు చేసిందన్నారు.

ఈ విషయంలో అమెరికా వెర్షన్ మరోలా ఉంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడటం వల్ల మినహాయింపులు రద్దు చేశామని అంటోంది. ఓ వైపు నేతల మాటలు.. మరోవైపు పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×