E-Paper
Advertisement

Iran closed airspace: ఇరాన్‌పై దాడులకు అమెరికా రెడీ.. ఎయిర్‌‌స్పేస్ మూసివేత ఇరాన్, కొనసాగుతున్న టెన్షన్

Iran closed airspace: ఇరాన్‌పై దాడులకు అమెరికా రెడీ.. ఎయిర్‌‌స్పేస్ మూసివేత ఇరాన్, కొనసాగుతున్న టెన్షన్
Advertisement

Iran closed airspace: ఇరాక్‌లో ఏం జరుగుతోంది? ఆ దేశ ఎందుకు భయపడతోంది? అక్కడ జరుగుతున్న ఆందోళనలే కారణమా? అమెరికా దాడి చేస్తోందని భయమా? అందుకేనా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. 24 గంటల్లో అమెరికా దాడులు చేయవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.

అమెరికా దాడుల వార్తలు.. ఎయిర్‌‌స్పేస్ మూసివేసిన ఇరాన్‌

Advertisement

గడిచిన రెండు వారాలుగా ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆందోళనలు ఏ మాత్రం తగ్గలేదు. అక్కడి ప్రభుత్వం నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యలో అక్కడి మృతుల సంఖ్య 2500 మంది దాటొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి.

రేపో మాపో అమెరికా దాడులు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆదేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నోటామ్‌ ప్రకారం.. జనవరి 14 రాత్రి ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్‌ పరిధిలోకి వచ్చేఎయిర్ స్పేస్‌లో అన్నిరకాల విమానాల రాకపోకలను నిలిపి వేసింది.

Advertisement

అంతర్జాతీయ విమానాల దారి మళ్లింపు, ఇరాన్‌లో టెన్షన్

సివిల్‌, మిలిటరీ, కార్గో వంటి విమానాలు ఇరాన్ మీదుగా రాకుండా పూర్తిగా నిషేధం విధించింది. ఇరాన్‌ నుంచి వెళ్లే ఇంటర్నేషనల్ విమానాలకు ముందుగా ఆ దేశం నుంచి అనుమతి కోవాలని ప్రకటించింది. ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో కమర్షియల్ విమానాలు కనిపించలేదు.

లుఫ్తాన్సా, ఎమిరేట్స్‌, ఖతార్ ఎయిర్వేస్‌, టర్కిష్ ఎయిర్లైన్స్‌, ఎయిర్ ఇండియా వంటి అనేక అంతర్జాతీయ ఎయిర్‌లైన్సు సంస్థలు తమ విమానాల దారి మళ్లించడం మొదలుపెట్టాయి. ఆ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ధరల పెరుగుదలపై నిరసనలు చెలరేగడంతో ఇంటర్నెట్‌ నిలిపివేసింది.

ALSO READ: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి

దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదిలావుండగా ఇరాన్‌పై రానున్న 24 గంటల్లో సైనిక చర్యకు దిగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్‌తోపాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయిస్తోందని సమాచారం.

ఖతార్‌లోని ఓ మిలిటరీ స్థావరం నుంచి బ్రిటన్‌ తన సిబ్బందిని ఉపసంహరించుకుంది. అమెరికా దాడులను ఎదుర్కొనడానికి ఇరాన్‌ సైన్యం సమాయత్తమైంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందోనని టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. మరోవైపు ఎలాన్‌ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌ ఇరాన్‌లో ఇంటర్నెట్‌ సర్వీసు ఉచితంగా అందిస్తోంది. ఉపగ్రహాల సాయంతో ఇరాన్‌ పౌరులు బయట ప్రపంచంతో అనుసంధానం అవుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×