E-Paper
Advertisement

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు
Advertisement

Bab al Mandab Strait Closed: పశ్చిమాసియాలో పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఇరాన్ ని తన దారికి తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. ఇప్పటికే హర్మూజ్‌ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. తాజాగా మరో పిడుగులాంటి వార్త గుబులు రేపుతోంది.

ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు ప్రకటన-ఎర్ర సముద్రానికి గేట్‌వే బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధిని మూసి వేస్తున్నట్లు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటన చేశారు. సౌదీ అరేబియాకు నౌక రాకపోకలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తామ విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తున్నట్లు తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 12 శాతం బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ ద్వారా సాగుతుంది.

Advertisement

బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత- హౌతీల ప్రకటనను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఖండించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తమ నౌకలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపింది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం సమయంలో సౌదీ అరేబియా నుండి చమురు రవాణాకు ఎర్ర సముద్రం కీలకంగా మారింది.

ఖండించిన సౌదీ అరేబియా-అయితే ఇటీవలకాలంలో ఇరాన్.. సహాయం చేయాలని హౌతీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2022 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి హౌతీలు సైలైంట్ అయ్యారు. అమెరికా మళ్లీ ఇరాన్‌పై గడిచిన 10 రోజులుగా దాడులు తీవ్రం చేయడంతో హౌతీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

ప్రపంచ దేశాల్లో గుబులు మొదలు-అరేబియా ద్వీపకల్పంలోని దక్షిణ భాగంలో ఉంది బాబ్ ఎల్-మండేబ్. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారం కూడా. దీని గుండా ప్రపంచ కంటైనర్ వాణిజ్యంలో నాలుగో వంతు ఈ జలసంధి ద్వారా సూయజ్ కాలువకు రాకపోకలు సాగిస్తాయి. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమయంలో నెలల తరబడి నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయి హౌతీలు.

ALSO READ: పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

100కు పైగానే నౌకలపై దాడి చేసి నౌకా రవాణాకు అంతరాయం కలిగించగల సామర్థ్యం తమదని గతంలో తేలింది. పొరుగున ఉన్న సౌదీ అరేబియాపై హౌతీలు అదే స్థాయిలో దాడులు చేస్తారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సివుంది. 2014లో హౌతీలు సనాలోని ప్రభుత్వాన్ని కూలదోయడంతో అంతర్యుద్ధం కారణంగా యెమెన్ నాశనమైంది. ప్రభుత్వ పాలనను పునరుద్ధరించే ప్రయత్నంలో సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి జోక్యం చేసుకుంది. 2015లో ఈ సంఘర్షణ తీవ్రరూపం దాల్చిన విషయం తెల్సిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×