E-Paper
Advertisement

Iran Attack Oil Tanker Oman Coast: చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు

Iran Attack Oil Tanker Oman Coast: చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు
Advertisement

Iran Attack Oil Tanker Oman Coast: పశ్చిమ ఆసియాలో ఇరాన్.. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు ఇప్పుడు సముద్ర వాణిజ్య మార్గాలను అతలాకుతలం చేస్తోంది. ఒమన్‌ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక భారీ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడి సమయంలో ట్యాంకర్‌లో మొత్తం 15 మంది భారతీయులు విధులు నిర్వహిస్తుండగా.. వారిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

దాడికి గురైన ట్యాంకర్‌లో ఉన్న సిబ్బంది అంతా ప్రాణభయంతో వణికిపోయారు. గాయపడిన నలుగురు భారతీయులకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 11 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒమన్‌ సముద్ర తీరంలో జరిగిన ఈ ఘటనతో అంతర్జాతీయ చమురు రవాణా సంస్థలు తమ నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

భారత ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ నావికుల భద్రత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Read Also: Strait of Hormuz Closed: భారత్‌కు చమురు సెగ.. హార్ముజ్ మూతతో నిలిచిన ట్యాంకర్లు.. పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్!

Advertisement

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×