E-Paper
Advertisement

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు, చర్చలకు సిద్ధమే

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. కంటైనర్ నౌకపై ఇరాన్  కాల్పులు, చర్చలకు సిద్ధమే
Advertisement

Strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మేఘాలు క్రమంగా కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య రెండో విడత ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన ఉండగా అది కాస్త వెనక్కి వెళ్లింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ పొడిగించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన కొద్దిగంటలకే హోర్ముజ్ జలసంధిలో ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరపడం కలకలం రేపింది.

హోర్ముజ్ జలసంధిలో కొత్త టెన్షన్

Advertisement

హర్మూజ్ జలసంధిలో ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్ బలగాలు కాల్పులకు దిగినట్టు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. కాల్పులకు ముందు గన్‌ బోట్ నౌకకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని తెలుస్తోంది. నౌకపై కాల్పులు జరిగాయని, దీంతో తాము నిలిపి వేశారని సరుకు రవాణా నౌక తెలిపింది.

తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. ఇరాన్ మీడియా సైతం ఈ దాడిని ధ్రువీకరించింది. కాల్పులు ఎందుకు జరిపాల్సి వచ్చింది అనే కారణాలను వెల్లడించలేదు. ఇటీవల ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా నేవీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు, చర్చలకు సిద్ధమే

ఈ నేపథ్యంలో కంటైనర్ నౌకపై దాడి జరగడం మరోసారి ఉద్రిక్తతలు పెంచే విధంగా కనిపిస్తోంది. గడిచిన వారంలో నౌకపై కాల్పుల ఘటనలు రెండుసార్లు చోటు చేసుకున్నాయి. మరోవైపు అమెరికాతో చర్చలపై ఇరాన్ రియాక్ట్ అయ్యింది. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ దీనిపై నోరు విప్పారు. రెండో విడత చర్చలకు తాము సిద్ధమని ఆయన వెల్లడించారు.

అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో తమ నౌకలపై కొనసాగుతోన్న దిగ్బంధాన్ని ఎత్తివేయాలనే షరతు విధించారు. తమ నౌకలను దిగ్బంధించడంతోపాటు అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. తమ షరతులకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందాయని, దిగ్బంధనాన్ని తొలగిస్తే వెంటనే చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ALSO READ: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు, పోర్టుల దిగ్బంధం తప్పదు

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×