E-Paper
Advertisement

Filipino women: ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ! ఇదిగో వీడియో

Filipino women: ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ! ఇదిగో వీడియో
Advertisement

Filipino women: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దుబాయ్‌లో నివసిస్తున్న ఒక ఫిలిప్పీన్స్ మహిళ తన ఇంట్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా, ఒక్క సారిగా పెద్ద శబ్దం రావడంతో ఆమె భయాందోళనకు గురై ఎగిరిపడటం ఆ వీడియోలో కనిపిస్తుంది. క్షిపణి దాడి కారణంగానే ఆ భవనం ప్రకంపనలకు లోనైందని, దీనివల్ల ఆమె ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నిజానికి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ లక్ష్యంగా వెళ్లినప్పటికీ, ఆ సమయంలో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాల్లో ఆకాశంలో వెలుగులు చిమ్ముతూ వెళ్తున్న క్షిపణులు స్పష్టంగా కనిపించాయి. ఈ క్రమంలోనే సదరు మహిళ తన అనుచరులతో ముచ్చటిస్తుండగా, సమీపంలో జరిగిన భారీ పేలుడు లేదా క్షిపణి శకలాలు పడటం వల్ల కలిగిన ప్రకంపనల ధాటికి ఆమె ఒక్కసారిగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ వీడియో చూసిన నెటిజన్లు యుద్ధం సామాన్యుల జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షిపణి నేరుగా అపార్ట్‌మెంట్‌పై పడిందా లేదా ఆ ప్రాంతంలో పడిన ప్రభావంతో భవనం కదిలిందా అనే విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ, ఆ దృశ్యాలు మాత్రం యుద్ధ భీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. అదృష్టవ శాత్తూ ఈ ఘటనలో ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

Also Read: అమెరికాతో ఇక చర్చల్లేవ్, వెనక్కి తగ్గం, తాడోపేడో తేల్చేందుకు సిద్ధమైన ఇరాన్

Advertisement

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీయులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో గగనతలాన్ని మూసివేయడం, విమానాల రద్దు వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇటువంటి వీడియోలు యుద్ధం యొక్క తీవ్రతను, అది కలిగించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×