E-Paper
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలున్నాయా?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలున్నాయా?
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. పపువా ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. మరికొన్ని చోట్ల 6.3, 6.5గా నమోదైంది. శనివారం రాత్రి 10.46 గంటలకు భూకంపం రాగా.. భూకంప కేంద్రాన్ని 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

అలాగే భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే ప్రమాదం లేదని వాతావరణ విభాగం తెలిపింది. కానీ.. మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం సంభవించిన ప్రాంతం జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 10 కిలోమీటర్ల దిగువన ఉంది.

Advertisement

27 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో తరచూ భూప్రకంపనలు వస్తుంటాయి. నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 331 మంది మరణించగా.. 600 మందికి పైగా గాయపడ్డారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం, సునామీ 4340 మందిని బలితీసుకుంది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×