E-Paper
Advertisement

India’s Gas Woes: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు.. చిక్కుకున్న 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం

India’s Gas Woes: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు.. చిక్కుకున్న 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం
Advertisement

India’s Gas Woes: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయా? కీలక నేతలను కోల్పోయిన బాధలో ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోందా? పొరుగుదేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఎక్కుపెట్టిందా? ఇంతకీ హర్మూజ్ జలసంధి భారత్‌కు చెందిన గ్యాస్ నౌకలు ఎన్ని ఉన్నాయి? గ్యాస్, ఆయిల్ నిల్వల డేటా ఇవ్వాలని కంపెనీలను కేంద్రం ఎందుకు ఆదేశించింది?

ఇరాన్‌తో తీవ్రమవుతున్న పరిస్థితులు.. హర్మూజ్ జలసంధిలో 22 భారత్ నౌకలు

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీని ప్రభావం యూరప్‌తోపాటు ఆసియా దేశాలపై పడుతోంది. భారత్‌కు రావాల్సిన దాదాపు 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ జలసంధిలో నిలిచి పోయింది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీని ప్రభావం యూరప్‌తోపాటు ఆసియా దేశాలపై పడుతోంది. భారత్‌కు రావాల్సిన దాదాపు 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ జలసంధిలో నిలిచి పోయింది. గల్ప్ నుంచి భారత్‌కు రావాల్సిన 22 భారత్ నౌకలు అక్కడ చిక్కుకున్నాయి. అందులో భారత్‌కు ఎల్పీజీని తీసుకొస్తున్న నౌకలు ఉన్నాయి.

Advertisement

డేటా ఇవ్వాలని చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశం

యుద్ధం నేపథ్యంలో భద్రతా పరమైన అనుమతులు లభించలేదు. దీంతో అక్కడ ఆయా నౌకలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. అయితే బుధవారం రాత్రి ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ మెరుపు దాడులు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. యుద్ధం మొదలై ఇప్పటికి 20 రోజులకు చేరుకున్నా, ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

దీని ప్రభావం వల్ల హర్మూజ్ జలసంధిలో భారత్‌కి చెందిన 22 నౌకలు ఉండిపోయాయి. 6 ఎల్‌పిజి నౌకలు, ఎల్‌ఎన్‌జి ట్యాంకర్ ఒకటి, 4 ముడి చమురు నౌకలు, రసాయనాలు-ఉత్పత్తులకు చెందిన ఒకటి, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్‌లు జలసంధిలో చిక్కుకున్నాయి.  జలసంధిలో ఇదే పరిస్థితి కొనసాగితే దేశీయంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ALSO READ: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే ఇరాన్‌లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం

దీనిపై కేంద్ర పెట్రోలియం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలు దృష్టి సారించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఇరాన్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చమురుకు అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా దేశంలో చమురు, గ్యాస్‌ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆయా సంస్థల వద్దనున్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేసే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కంపెనీలు వాటికి సంబంధించి వివరాలను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్‌ సెల్‌‌కు ఇవ్వనున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×