E-Paper
Advertisement

Foreign Citizenship : సంపన్న దేశాల పౌరసత్వం కోసం ఎగబడుతున్న భారతీయలు.. ఏ దేశానికి ఎక్కువగా వెళుతున్నారో తెలుసా?

Foreign Citizenship : సంపన్న దేశాల పౌరసత్వం కోసం ఎగబడుతున్న భారతీయలు.. ఏ దేశానికి ఎక్కువగా వెళుతున్నారో తెలుసా?
Advertisement

Foreign Citizenship : విదేశాలకు వలస వెళుతున్న భారతీయుల(Indian) సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది సంపన్న దేశాల పౌరసత్వం(citizenship) పొందడానికి పరుగులు తీస్తున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయా దేశాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు, శాంతి భద్రతలు, సామాజిక, రాజకీయ స్థిరత ఉండడంతో భారతీయులు అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారు.

భారతీయులు ఎక్కువగా ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళుతున్నప్పటికీ.. కొందరు మాత్రం సంపన్న దేశాల పాస్‌పోర్టు తీసుకుంటే.. ప్రపంచంలో చాలా దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చుననే కారణం చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడా లాంటి దేశాల పాస్‌పోర్టు ఉంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు వీసా లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే అక్కడి ప్రభుత్వాలు పౌరసత్వం తీసుకుంటున్న భారతీయులకు కీలక శాఖలలో ఉద్యోగాలను అందిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతం కెనడా, భారతదేశాల మధ్య రాజకీయ విభేదాలున్నప్పటికీ.. కెనెడా పౌరసత్వం తీసుకుంటున్న విదేశీయుల జాబితాలో భారతీయలే అధికంగా ఉన్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కొఆపరేషన్ ఎండ్ డెవలప్మెంట్ (OECD) చెబుతోంది. అలాగే భారతీయులు మిగతా దేశాలకంటే అమెరికా పౌరసత్వంపై మక్కువ చూపిస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా కెనెడా ప్రభుత్వం విదేశీ నాగరికులకు చాలా వేగంగా పౌరసత్వం అందిస్తోంది. అలాగే 2023 సంవత్సరానికిగాను సంపన్న దేశాల పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 28 లక్షల మంది విదేశీయులు సంపన్న దేశాల పౌరసత్వం తీసుకున్నారని సమాచారం.

Advertisement

అగ్రస్థానంలో అమెరికా
OECD రిపోర్టు ప్రకారం.. 2021 సంవత్సరంలో 1.3 లక్షల మంది భారతీయులు సంపన్న దేశాల పౌరసత్వం పొందారు. విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు 56,000 మంది భారతీయులు అమెరికా పాస్‌పోర్టు తీసుకున్నారు. ఆ తరువాతి స్థానాలలో ఆస్ట్రాలియా(24,000), కెనడా (21,000) దేశాలు ఉన్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×