E-Paper
Advertisement

Russia: రష్యా యూనివర్సిటీలో కలకలం.. ఓ వ్యక్తి కత్తితో దాడి, భారతీయ విద్యార్థులకు గాయాలు

Russia: రష్యా యూనివర్సిటీలో కలకలం.. ఓ వ్యక్తి కత్తితో దాడి, భారతీయ విద్యార్థులకు గాయాలు
Advertisement

Russia: అమెరికాలోనే కాదు రష్యాలోనూ భారతీయ విద్యార్థులకు అదే పద్దతి. బాష్కోర్తోస్థాన్ రిపబ్లిక్‌లోని ఓ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి దిగాడు ఈ ఘటనలో పలువురు భారతీయుడు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఘటన వెనుక ఏం జరిగింది?

రష్యా వైద్య యూనివర్సిటీలో కలకలం

Advertisement

రష్యాలోని ఉఫా సిటీలో ఓ యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి ఘటనకు వేదికైంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో నలుగురు భారతీయ విద్యార్థులతోపాటు ఇద్దరు స్థానిక పోలీసు అధికారులు గాయడపడ్డారు. ఈ విషయాన్ని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని విదేశీ విద్యార్థుల హాస్టల్‌లోని స్పోర్ట్స్ హాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కత్తి, ఆయుధాలు ధరించిన ఓ యువకుడు అందులోకి ప్రవేశించి విద్యార్థులపై దాడులకు దిగాడు. దాడికి దిగిన వ్యక్తి వయస్సు 15 ఏళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని రష్యా పోలీసులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన నలుగురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు పోలీసులను వైద్య చికిత్స కోసం స్థానిక క్లినికల్‌కి తరలించారు.

Advertisement

ఓ వ్యక్తి కత్తితో దాడి, భారతీయ విద్యార్థులకు గాయాలు

గాయపడినవారిలో నలుగురు యూనివర్సిటీలో చదువుతున్న భారతీయలుగా నిర్ధారించారు. అయితే ఆ వ్యక్తుల వివరాలు అధికారులు వెల్లడించలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు గాయపడ్డారని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు.

ఈ ఘటన గురించి తెలియగానే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రియాక్ట్ అయ్యింది. ఈ సంఘటన గురించి తెలిసిందని, గాయపడిన వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారని ధృవీకరించింది. దాడి తర్వాత రష్యా అధికారులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.

ALSO READ: లోయలో పడిన పెళ్లి బస్సు.. స్పాట్‌లో 60 మంది

స్థానిక మీడియా నివేదికల ప్రకారం నిందితుడ్ని పిల్లల ఆసుపత్రిలో చేరాడు. రష్యన్ చట్టం ప్రకారం.. 14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తులపై దాడులు తీవ్రమైన హింసాత్మక నేరాలుగా పరిగణిస్తారు. మైనర్లకు సంబంధించిన కేసులను చట్టపరమైన, వైద్య పర్యవేక్షణకు లోబడి నిర్ణయాలు ఉంటాయి.

ఉఫా రిపబ్లిక్ ఆఫ్ బాష్కోర్టోస్తాన్ రాజధాని ఉన్నత విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. ఈ సిటీలో వైద్య విద్య అభ్యసించేందుకు భారతదేశం సహా అనేక దేశాల నుంచి విద్యార్థులు చదువుల కోసం అక్కడికి వస్తుంటారు. వైద్య విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు కీలకమైన గమ్యస్థానం. ఘటన తర్వాత క్యాంపస్ భద్రత, విద్యార్థుల సంక్షేమం గురించి ప్రశ్నలను లేవనెత్తుతారు స్టూడెంట్స్ పేరెంట్స్.

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×