E-Paper
Advertisement

Canada News: కెనడాలో దారుణం.. భారతీయ స్టూడెంట్‌ చంపిన దుండగులు, అసలేం జరిగింది?

Canada News: కెనడాలో దారుణం.. భారతీయ స్టూడెంట్‌ చంపిన దుండగులు, అసలేం జరిగింది?
Advertisement

Canada News: కెనడాలో మరో దారుణం జరిగింది. ఇటీవల ఓ యువతి హత్యకు గురి కాగా, తాజాగా మరో భారతీయ స్టూడెంట్స్‌ని దుండగులు కాల్చి చంపారు. విద్యార్థి మృతిపై టొరంటోలోని భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. అసలేం జరిగింది?

కెనడాలో భారతీయల హత్యలు

Advertisement

ఒకప్పుడు అమెరికా.. ఇప్పుడు కెనడా. భారతీయులను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. కెనడాలోని టొరంటో స్కార్‌ బొరౌగ్‌ యూనివర్సిటీ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్‌ అవస్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అక్కడి భారతీయులు షాకయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ వద్ద టొరంటో యూనివర్సిటీలో చదువుతున్నాడు శివాంక్‌. మరి ఏం జరిగిందో తెలీదుగానీ కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో శివాంక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.

Advertisement

భారతీయ స్టూడెంట్‌‌ని చంపిన దుండగులు

ఈలోగా నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్‌ను తాత్కాలికంగా మూసి వేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూనివర్సిటీ విద్యార్థులు భయపడుతున్నారు. పోలీసులు దీన్ని హత్య ఈ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన లభించిన ఆధారాలను భద్రపరచడం, ఏమి జరిగిందో నిర్ధారించడం, ఆ వ్యక్తి బంధువులకు తెలియ చేశామన్నారు అక్కడి అధికారులు. మరోవైపు ఈ ఘటనపై టొరంటోలో భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో కాన్సులేట్ మృతుడి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతోందని రాసుకొచ్చింది.

ALSO READ:  నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు తాను భరిస్తానన్న టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్

స్థానిక అధికారులకు అవసరమైన సహాయం చేస్తున్నామని ఎక్స్ లో రాసుకొచ్చింది. ఇటీవల కెనడాలో భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా హత్యకు గురైంది. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. ఆమె సహచరుడు అబ్దుల్‌ గఫూరీ నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతలో మరో విద్యార్థి హత్యకు గురికావడంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×