E-Paper
Advertisement

Punjab woman dead in US: న్యూజెర్సీలో దుండగుడు కాల్పులు, పంజాబ్ మహిళ మృతి.. మరొకరికి గాయాలు

Punjab woman dead in US: న్యూజెర్సీలో దుండగుడు కాల్పులు, పంజాబ్ మహిళ మృతి.. మరొకరికి గాయాలు
Advertisement

Punjab woman dead in US: అమెరికాలో దారుణం జరిగింది. న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన మహిళలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఆమె సోదరికి తీవ్ర గాయాల య్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

అమెరికా న్యూజెర్సీలోని మిడిల్ సెక్స్ కౌంటీలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలు జస్వీర్‌కౌర్, ఆమె సోదరి గగన్‌దీప్ కౌర్ రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వీరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. జస్వీర్‌కౌర్ స్పాట్‌లో మరణించగా, గగన్‌దీప్ కౌర్ తీవ్రగాయాలు అయ్యాయి.

Advertisement

స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆంబులెన్స్ సాయంతో సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జస్వీర్ కౌర్ మరణించగా, ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కాల్పులు జరిగిన వ్యక్తి గౌరవ్ కౌర్ కూడా భారతీయుడే. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని వాషింగ్టన్‌లో తన ఇంటి వద్దే అరెస్ట్ చేశారు.

ఇదిలావుండగా బాధిత మహిళలు ఇద్దరు నిందితుడికి గతంలో పరిచయం ఉంది. పంజాబ్‌లో గగన్‌దీప్ కౌర్, తాను కలిసి చదువుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే కాల్పులు జరపడానికి కారణాలు తెలియాల్సివుంది. అమెరికాలో పంజాబ్ మహిళను భారతీయుడే చంపడం ఇదే తొలిసారి. గతంలో ఆ తరహా ఘటనలు లేవని అంటున్నారు.

Advertisement

ALSO READ: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి, ఇంజన్‌లో మంటలు.. ఆపై

జస్వీర్‌కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో జాబ్ చేస్తోంది. ఆమె భర్త ట్రక్కు డ్రైవర్. ఐదేళ్ల కిందట భర్తతో కలిసి అమెరికా వెళ్లిందామె. ఆమె సోదరి గగన్‌దీప్ స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్లింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×