E-Paper
Advertisement

అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. ఆపై రూ. 950 కోట్లు, భారత సంతతి వ్యాపారి అరెస్- డ్రగ్స్ ఆపై అమ్మాయిల ఎర

అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. ఆపై రూ. 950 కోట్లు, భారత సంతతి వ్యాపారి అరెస్- డ్రగ్స్ ఆపై అమ్మాయిల ఎర
Advertisement

Bank Fraud Case: అమెరికాలోని ఓ బ్యాంకును మిలియన్ డాలర్ల మేరా మోసం చేశారన్న ఆరోపణల కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అరెస్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలోని తన భవనంలో ఆయనకు సంబంధించిన ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. ఏకంగా  950 కోట్ల రూపాయలు

Advertisement

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు భారత సంతతికి చెందిన 44 ఏళ్ల వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని. తప్పుడు పత్రాలతో ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయన్ని అరెస్టు చేశారు పోలీసులు. దాదాపు 100 మిలియన్ డాలర్లు అంటే రూ. 950 కోట్లు. ఆయనకు సంబంధించి ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.

టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలను తారుమారు చేసి బ్యాంకును మోసగించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. తన రియల్ ఎస్టేట్ ఆస్తులను హామీగా చూపించారట. ఆయా ఆస్తులపై అప్పటికే ఉన్న రుణాలను దాచి పెట్టేందుకు టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలను ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 2024-25  ఏప్రిల్ మధ్య డిజిటల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మోసానికి పాల్పడ్డాడు మఖిజాని.

Advertisement

భారత సంతతి వ్యాపారి మహేందర్ మఖిజాని అరెస్.. ఉద్యోగులకు డ్రగ్స్ ఆపై అమ్మాయిల ఎర

టెక్నాలజీ సాయంతో పత్రాలను మార్చడం ద్వారా బ్యాంకు అధికారులను తప్పు దోవ పట్టించారు. తన ఆస్తులకు ఎలాంటి రుణాలు లేవని నమ్మించే ప్రయత్నం చేశారు. ఉన్నవి సురక్షితమైనవని బ్యాంకు అధికారులను నమ్మించారు.  మోసం చేసిన డబ్బుతో మఖిజానీ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపినట్లు అధికారులు దాఖలు చేసిన పత్రాల్లో బయటపడింది.

ప్రైవేట్ జెట్లు, సూపర్ కార్లు, విలాసవంతమైన భవనాలతో జీవితం సాగిస్తున్నాడు. మహిళలను అధికారులకు ఎర వేయడం, డ్రగ్స్‌తో కూడిన పార్టీలు ఇచ్చి బ్యాంకు ఉద్యోగులను బ్లాక్‌ మెయిల్‌కు దిగినట్టు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: హ‌ర్మూజ్ జలసంధిలో సీక్రెట్ ఆపరేషన్..గుట్టు బయటపెట్టిన ట్రంప్ 

ఆ తరహా పార్టీల ద్వారా బ్యాంకు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని మోసపూరిత కార్యకలాపాలకు సాగించినట్టు తెలుస్తోంది.  ఈ కేసులో మఖిజానీపై నేరం రుజువైతే గరిష్ఠంగా 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసును ఎఫ్‌బీఐ- ఐఆర్ఎస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్-ఎఫ్‌డీఐసీ వంటి విభాగాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×