E-Paper
Advertisement

Indian Navy Haldia Base: హల్దీయాలో ఇండియన్ నేవీ కొత్త బేస్.. చైనా, బంగ్లాదేశ్‌లకు భారత్ గట్టి కౌంటర్!

Indian Navy Haldia Base: హల్దీయాలో ఇండియన్ నేవీ కొత్త బేస్.. చైనా, బంగ్లాదేశ్‌లకు భారత్ గట్టి కౌంటర్!
Advertisement

Indian Navy Haldia Base: భారత్‌లో పక్కలో బల్లెంగా తయారవుతున్న బంగ్లాదేశ్‌.. ఆ దేశ తీర జలాల్లో పెరుగుతున్న చైనా, పాకిస్థాన్ నేవీ కార్యకలాపాలు. దీంతో వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఇండియన్ నేవీ సిద్ధమైంది. వెస్ట్‌బెంగాల్‌లోని హల్దీయాలో కొత్త నేవీ బేస్‌ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హల్దీయా నుంచి చిన్నపాటి యుద్ధనౌకలను రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతోంది ఇండియన్ నేవీ.

హల్దీయాలో ఇప్పటికే ఓ డాక్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు నేవీ దీనిని అభివృద్ధి చేసే పనిలో ఉంది. జెట్టీతో పాటు.. ఇతర వసతులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హల్దీయాలో ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్స్‌తో పాటు.. న్యూ వాటర్ జెట్ ఫాస్ట్‌ అటాక్ క్రాఫ్ట్స్‌ను మోహరించే ఆలోచనలో ఉంది నేవీ. ఇవి 40 నుంచి 45 నాట్స్‌తో వేగంతో దూసుకెళ్లే జెట్‌ బోట్స్‌. మారిటైమ్‌ ఆపరేషన్స్‌లో క్విక్ రెస్పాన్స్‌కు ఈ బోట్స్‌ చాలా కీలకం. అందుకే వీటిని హల్దీయాలో మోహరించే ఆలోచనలో ఉంది ఇండియన్ నేవీ. ఈ బోట్లలో CRN-91 గన్స్‌తో పాటు.. నాగాస్త్ర సిస్టమ్స్‌ ను మోహరిస్తారు.

Advertisement

మన దేశ తీర జలాలకు సమీపంలో చైనా నేవీ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి.. దీనికి తోడు చైనాకు రెడ్ కార్పెట్ పరుస్తుంది బంగ్లాదేశ్‌. వీటితో పాటు బంగ్లాదేశ్‌ నుంచి సముద్రం గుండా భారత్‌లోకి చొరబడే ఘటనలు పెరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ బేస్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు భారత్, బంగ్లా తీరంలో ఏదైనా అలజడి జరిగితే వెగంగా స్పందించే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఈ బేస్‌లో వంద మంది నేవీ ఆఫీసర్స్, సెయిలర్స్‌ను మొదట మోహరిస్తారని తెలుస్తోంది. అయితే ఫుల్‌ ఫ్లెడ్జ్‌ కమాండ్‌ సెంటర్‌గా ఉండదు. కానీ వ్యూహాత్మకంగా మాత్రం కీలకపాత్ర పోషిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

ఇండియన్ నేవీ ఈస్ట్రన్ నావల్ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రస్తుతం విశాఖలో ఉంది. దీనికి తోడు అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా ఇండియన్ నేవీ బేస్‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఈ బేస్‌ అదనం. దీంతో నేవీ బలం మరింత పెరుగుతోంది. నిజానికి హల్దీయా బేస్‌పై చర్చ చాలా రోజులుగా జరుగుతున్నా.. నిర్మాణం మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ బేస్‌ పూర్తిగా పని చేయడం ప్రారంభిస్తే.. తీర ప్రాంతాన్ని మరింత జాగ్రత్తగా మానిటర్ చేయడే గాకుండా. చొరబాట్లను అడ్డుకోవడం, స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించడం మరింత సులువు అవుతుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

ALSO READ: నేషనల్ హైవేపై కారులో మంటలు.. వెంటనే బయటకు దూకడంతో..?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×