E-Paper
Advertisement

Big Ticket draw: ఆరేళ్ల తర్వాత .. డ్రైవర్‌కు 64 కోట్ల జాక్‌పాట్, ఇండియాకు పయనం

Big Ticket draw: ఆరేళ్ల తర్వాత .. డ్రైవర్‌కు 64 కోట్ల జాక్‌పాట్, ఇండియాకు పయనం
Advertisement

Big Ticket draw: ప్రయత్నం చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందని నిరూపించాడు పైన కనిపిస్తున్న ఓ డ్రైవర్. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరేళ్లపాటు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశాడు. చివరకు 64 కోట్ల రూపాయలను లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ? అన్న డీటేల్స్ లోకి వెళ్లొద్దాం.

దుబాయ్‌లో ఇండియా డ్రైవర్ కు జాక్‌పాట్

Advertisement

పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు అబ్దుల్‌ రషీద్‌. కేరళంకు చెందిన ఈ వ్యక్తి దాదాపు 17 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆయన ఫ్యామిలీ కేరళంలో ఉంటోంది. దుబాయ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లాటరీ. రషీద్ కూడా అదే చేశాడు. గడిచిన ఆరేళ్లుగా బిగ్ టికెట్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నాడు.

రషీద్ మాత్రం లాటరీ తగలపోయినా నిత్యం అదే పనిలో ఉన్నాడు. చివరకు 25 మిలియన్ దిర్హమ్‌ల బిగ్ టిక్కెట్ లాటరీ కొనుగోలు చేశాడు. ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ. 64 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఊహించని జాక్‌పాట్‌ తగలడంతో ఆనందంలో మునిగిపోయాడు. అయితే ఆ లాటరీ టికెట్‌ను కొంతమంది సభ్యులు కలిసి కొనుగోలు చేశారు.

Advertisement

బిగ్ టికెట్  లాటరీలో రూ. 64 కోట్లు గెలుచుకున్నాడు, మరొక డ్రైవర్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు

అందులో రషీద్ కూడా భాగస్వామి. వచ్చే డబ్బును అందరం కలిసి పంచుకుంటామని చెప్పాడు. లాటరీ గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం ఉద్యోగం మానేసే ఆలోచన లేదన్నాడు. దాని టర్మ అయిన తర్వాత ఇండియాకు వచ్చేస్తానని చెప్పాడు. లాటరీలో వచ్చిన డబ్బును ఎలా ఉపయోగించాలో కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదిస్తానని తెలిపాడు.

అబుదాబిలో నివాసం ఉంటున్నాడు కేరళకు చెందిన మరొక డ్రైవర్ అష్రఫ్ అబ్దుల్లా. ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు పైనే ఉంటుంది. డ్రీమ్ కార్ విభాగంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని గెలుచుకున్నాడు. అతడు గడిచిన 16 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు.

ALSO READ: అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ భారత్‌కు ఉపశమనం.. హోర్మూజ్ జలసంధిని దాటిన ‘సర్వశక్తి’

అబ్దుల్లా ఫ్యామిలీ మాత్రం ఇండియాలో ఉంటోంది. లాటరీలో కారు గెలవడంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. డ్రీమ్ కార్ టిక్కెట్‌ను కొనుగోలు చేయమని తన స్నేహితుడు సలహా ఇచ్చాడని తెలిపాడు. మొత్తానికి ఇద్దరు కేరళం వాసులకు జాక్ పాట్ తగలడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×