E-Paper
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ఎక్స్‌ ఖాతాల్లో వెల్లడించారు.

India Maldives : భారత్‌-మాల్దీవుల వివాదం వేళ.. విదేశాంగ మంత్రుల భేటీ..
Advertisement

India Maldives : భారత్‌-మాల్దీవుల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో.. విదేశాంగ మంత్రుల మధ్య భేటీ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వీరు లోతుగా చర్చలు జరిపారు. వీటి వివరాలను మంత్రులు తమ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాల్లో వెల్లడించారు.

ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, మాల్దీవుల మంత్రి మూసా జమీర్‌తో భేటీ అయ్యారు. తమ మధ్య ఇరుదేశాల సంబంధాలపై లోతుగా చర్చ జరిగినట్లు జై శంకర్ పేర్కొన్నారు. భారత సైనికుల ఉపసంహరణపై జరుగుతోన్న ఉన్నతస్థాయి సమావేశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించారు. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఉన్న మార్గాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల మంత్రి మూసా జమీర్ తెలిపారు.

Advertisement

ఇటీవల ప్రదాని మోదీ, లక్షద్వీప్ లపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న భారత దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరిన సంగతి తెలిసిందే. అక్కడ 88 మంది భారత్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×