// // Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య వార్ వస్తే.. రసాయన ఆయుధాలు మాటేంటి? -->
E-Paper
Advertisement

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య వార్ వస్తే.. రసాయన ఆయుధాలు మాటేంటి?

Iran Vs America: ఇరాన్-అమెరికా మధ్య వార్ వస్తే.. రసాయన ఆయుధాలు మాటేంటి?
Advertisement

Iran Vs America: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ఆయా దేశాలు ఎలాంటి ఆయుధాలు ప్రయోగించనున్నాయి? అమెరికా బలమైన అస్త్రాలను ప్రయోగించాలని భావిస్తోందా? అదే జరిగితే వెనక్కి తగ్గకూడదని ఇరాన్ భావిస్తోందా? ఈ విషయంలో అమెరికా కాస్త వెనుకడుగు వేస్తోందా? ఆ దేశం క్షిపణుల కంటే ప్రాణాంతకరమైన ఆయుధాలు ఉన్నాయా? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఇరాన్-అమెరికా మధ్య వార్ వస్తే..

Advertisement

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌‌పై హత్యాయత్నం జరిగింది. ఆనాటి ఘటనకు సంబంధించిన ఫొటోని ఇరాన్ టీవీ చూపిస్తూ ఈసారి అది గురి తప్పదని బెదిరింపుల సందేశాన్ని గతరాత్రి ప్రచారం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ లెక్కన అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చనే ఊహాగానాల వేళ కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

క్షిపణుల కంటే రసాయన ఆయుధాలు ఇరాన్ దగ్గర ఉండవచ్చని అమెరికా రక్షణ రంగ నిపుణుల అంచనా. ఎందుకంటే క్షిపణుల కంటే వాటిని ప్రాణాంతకరమైనవిగా చెబుతుంటారు యుద్ధ నిపుణులు. వాటి వల్ల భవనాలు నేలమట్టం కావు. కాకపోతే సామూహికంగా అధిక ప్రాణ నష్టం జరుగుతుంది. ఫెంటానిల్స్ లేదా మెడెటోమైడిన్ వంటి కెమికల్స్‌తో తయారు చేసిన రసాయన ఆయుధాలుగా చెబుతున్నారు.

Advertisement

రసాయన ఆయుధాలు మాటేంటి?

యుద్దానికి వచ్చే శత్రువుల నాడీ వ్యవస్థపై ఆ తరహా ఆయుధాలు దాడి చేస్తాయి. దానివల్ల సైన్యంతోపాటు ప్రజలు భారీ స్థాయిలో చనిపోతారని చెబుతున్నారు. ఒకప్పుడు యుద్దాలు బలగాల మీద ఆధారపడేవి. ఇప్పుడు అలా కాకుండా కేవలం మిస్సైల్స్‌పై ఆధారపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ వార్ కూడా పిలవొచ్చు. క్షిపణుల రూపంలో రసాయన ఆయుధాలు జార విడిచే అవకాశముందని అంటున్నారు.

ఇరాన్ వద్ద రసాయన ఆయుధాలు ఉన్నట్లు అమెరికా ఎలా గుర్తించింది? అమెరికా విదేశాంగ శాఖ 2024-25 నివేదికలలో ఇరాన్ వద్ద రసాయన ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా వేసింది. టెహ్రాన్ తన రసాయన ఉత్పత్తి సౌకర్యాలను పూర్తిగా ప్రకటించలేదని, అల్లర్ల నియంత్రణ కోసం కాకుండా ప్రమాదకర ప్రయోజనాల కోసం వాటిని తయారు చేస్తోందని వాషింగ్టన్ ఆరోపణ. ఇరాన్ తన అధునాతన బయో టెక్నాలజీ కారణంగా జీవ సంబంధానికి సంబంధించిన వాటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ALSO READ: ఇరాన్‌పై దాడులకు అమెరికా రెడీ.. ఎయిర్ స్పేస్ మూసివేసిన ఇరాన్

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులపై అమర్చగల జీవసంబంధ వార్‌హెడ్‌లపై పని చేస్తుందని అమెరికా నిఘా వర్గాల మాట. ఆ తరహా యుద్ధం ఎప్పుడైనా జరిగిందా? 1980 ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధం అనుభవం అలాంటిదే. ఆ సమయంలో ఇరాక్ భయంకరమైన దాడులను ఆ దేశం ఎదుర్కొందని భావిస్తోంది. ఇరాన్ తన సొంత దాడి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుందని, వాటిలో కొన్నింటిని పూర్తిగా నాశనం చేయలేదని అమెరికా విశ్వసిస్తోంది.

అసాధారణ ఆయుధాలకు డెలివరీ వ్యవస్థలు చాలా ముఖ్యం. ఇరాన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి ఆయుధశాలను కలిగి ఉందని అంటోంది. IRGC రసాయన-జీవ వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి క్షిపణులను ఆప్టిమైజ్ చేస్తోందనట. వాటి కోసం డ్రోన్లను ఉపయోగిస్తోందని చెబుతోంది. ఇరాన్ నుంచి ఆ తరహా భయం అమెరికాను క్షణ క్షణం వెంటాడుతోందని అంటున్నారు నిపుణులు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×