E-Paper
Advertisement

World Biggest Cruise Ship : అతి భారీ నౌక.. టైటానిక్‌కు ఐదు రెట్లు

World Biggest Cruise Ship : అతి భారీ నౌక.. టైటానిక్‌కు ఐదు రెట్లు
Advertisement

World Biggest Cruise Ship : ఐకాన్ ఆఫ్ ది సీస్(Icon of the Seas).. ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ షిప్. వచ్చే నెల నుంచి ఈ నౌక పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. రాయల్ కరేబియన్ గ్రూప్‌కు చెందిన ఈ నౌకలో 5000 వేల మంది ప్రయాణించొచ్చు.

టైటానిక్ కన్నా ఇది ఐదు రెట్లు పెద్దది. పొడవు 1200 అడుగులు. ఐఫిల్ టవర్ ఎత్తు కన్నా ఎక్కువ. బరువు 2,50,800 టన్నులు. టైటానిక్ బరువు 46,329 టన్నులు మాత్రమే. ఆక్వాపార్క్, 20 డెక్‌లు, ఏడు స్విమింగ్ పూల్స్, స్నాక్ బార్స్, లాంజర్స్ వంటి సదుపాయాలెన్నో ఉన్నాయి.

Advertisement

ఈ షిప్‌లో సాహసికుల కోసం ఎన్నో వసతులు ఉన్నాయి. స్కై వాక్ వాటిలో ఒకటి. సముద్రానికి 154 ఎత్తులో స్కైవాక్ చేస్తుంటే ఆ మజాయే వేరు. ఇక డెక్‌పైనే సేదతీరాలనుకుంటే.. వినోదం, ఆనందాలకు కొదవే ఉండదు. మరీ ముఖ్యంగా ఆక్వా డోమ్ వాటర్ ఫాల్ వద్ద. అక్కడ రెస్టారెంట్లు, ఐస్ రింక్, సర్ప్ సిమ్యులేటర్, ఫ్లోరైటర్ వంటివెన్నో అందుబాటులో ఉంటాయి.

ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌకలో సముద్రయానం చేయాలనుకునేవారి కోసం అప్పుడే బుకింగ్ లు ఆరంభమయ్యాయి. 2025-26 సంవత్సరానికి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మియామి నుంచి కరేబియన్ దీవుల వరకు ఏడు రోజుల పాటు యాత్ర ఉంటుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×