E-Paper
Advertisement

Oscar: ఆస్కార్ అవార్డ్‌ను బంగారంతో చేస్తారా?.. ఫుల్ డీటైల్స్..

Oscar: ఆస్కార్ అవార్డ్‌ను బంగారంతో చేస్తారా?.. ఫుల్ డీటైల్స్..
Advertisement

Oscar: ఆస్కార్.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం ప్రతి ఒక్క సినీనటుడి డ్రీమ్. జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డును అందుకోవాలని కలలు కంటుంటారు. ఒక్కసారి ఆస్కార్ గ్రహీత అని పేరు వస్తే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అవకాశాలు వద్దన్నా.. క్యూ కడుతుంటాయి.

ఈ అవార్డులను ప్రధానం చేసే ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ 1927లో ఏర్పడింది. దీనిలో ముఖ్యంగా నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు అనే ఐదు విభాగాలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో విశేషమైన సేవలందించిన వారికి ఈ సంస్థ 1929 నుంచి అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ పేరిట అవార్డులను ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆ అవార్డులను ఆస్కార్ అని పిలుస్తున్నారు.

Advertisement

ఈ అవార్డును పసిడి వర్ణంతో తయారు చేస్తారు. ఓ యోధుడు వీరఖడ్గం చేతపట్టుకొని నిలుచొని ఉన్నట్లు కనిపిస్తుంది అవార్డు. దాని అడుగు భాగంలో రీలు చుట్ట ఉంటుంది. దానిలో 5 చువ్వలుంటాయి. అవి 5 విభాగాలకు సూచికలు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్ స్టాన్లీ 24 క్యారెట్ల బంగారంతో పూత అద్ది, 13.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువుతో ఈ అవార్డును తయారు చేశారు.

ప్రస్తుతం షికాగోకు చెందిన ఆర్.ఎస్.ఓవెన్స్ అండ్ కంపెనీ ఈ అవార్డులను తయారు చేస్తుంది. ఒక్క అవార్డు తయారు చేయడానికి 400 డాలర్ల వరకు ఖర్చు వస్తుందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.33 వేలు. 1929లో ప్రారంభమైన ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం ఈ ఏడాది 95 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×