E-Paper
Advertisement

Jet Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన జెట్, ఆరుగురు మృతి?

Jet Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. రన్‌వేపై కుప్పకూలిన జెట్, ఆరుగురు మృతి?
Advertisement

Jet Crash: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టేట్స్‌విల్లే రీజనల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సిన ‘సెసనా C550′ (Cessna C550) జెట్ విమానం అనూహ్య రీతిలో రన్‌వే సమీపంలో కుప్పకూలిపోయింది. విమానం నేలను తాకిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే విమానాశ్రయానికి కేవలం అరమైలు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొందని, తేలికపాటి వర్షం కురుస్తోందని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు పేర్కొన్నారు.

Advertisement

స్టేట్స్‌విల్లే రీజనల్ విమానాశ్రయంలో కూలిన సెసనా C550 జెట్..

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది? సిబ్బంది వివరాలు ఏమిటి? అనే విషయాలపై అధికారికంగా ఇంకా పూర్తి స్పష్టత లేదు. విమానం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం, సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది.

Advertisement

ఎయిర్‌పోర్ట్‌ను మూసివేసిన అధికారులు

ప్రమాద తీవ్రత దృష్ట్యా స్టేట్స్‌విల్లే రీజనల్ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమాన రాకపోకలను నిలిపివేసి, ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరణించిన వారి వివరాలను సేకరించేందుకు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

Also Read: రైలు బోగి కింద మంటలు.. రాష్ట్రంలో తప్పిన పెను ప్రమాదం, జస్ట్ అయితే..?

సోషల్ మీడియాలో వైరలవుతున్న ప్రమాద దృశ్యాలు..

ప్రమాదానికి గల కారణాలపై FAA, NTSB లోతైన దర్యాప్తును ప్రారంభించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×