E-Paper
Advertisement

అదే ఐస్‌లాండ్‌ రహస్యం.. ప్రపంచంలో ప్రశాంతమైన దేశం, 19 ఏళ్లుగా నెంబర్ వన్

అదే ఐస్‌లాండ్‌ రహస్యం.. ప్రపంచంలో ప్రశాంతమైన దేశం, 19 ఏళ్లుగా నెంబర్ వన్
Advertisement

Iceland: ఐస్‌లాండ్.. ఈ పేరు చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం ఏందంటే టక్కున గుర్తుకొచ్చేది ఈ దేశమే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 19వ సారి నెంబర్ వన్ స్థానం సాధించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్రస్థానం నిలబెట్టకోవడం వెనుక అసలు కథేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

అదే ఐస్‌లాండ్‌ రహస్యం-ప్రపంచ దేశాల ప్రశాంతతను అంచనా వేసే ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌-గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌-2026 లో ఐస్‌లాండ్‌ తొలి స్థానంలో నిలిచింది.  ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అదే ఐస్‌లాండ్‌ ప్రత్యేకత. ఎందుకంటే నేరాలు చాలా తక్కువ.ప్రజల మధ్య మంచి సంబంధాలు, బలమైన నమ్మకం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వాతావరణం.

Advertisement

ప్రపంచంలో ప్రశాంతమైన దేశం-ఇవన్నీ కలిసి ఆ దేశాన్ని ఏళ్ల తరబడి అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. ఐస్‌లాండ్‌లో సైన్యం అస్సలు ఉండదు. నాటోలో సభ్య దేశాల రక్షణ కోసం కోస్ట్‌గార్డ్‌-ప్రత్యేక బృందాలపై అక్కడి ప్రజలు ఆధారపడతారు. దేశంలో నేరాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయుధాలు ధరించరు. ప్రజల్లో భయాందోళనల కంటే నమ్మకం ఎక్కువగా కనిపిస్తుంది.

19 ఏళ్లుగా నెంబర్ వన్-అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు కూడా కరిగిన మంచు నుంచి రావడంతో నేరుగా తాగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రశాంతంగా జీవిస్తారు అక్కడి ప్రజలు. చిన్నారులను బయట నిద్రపుచ్చేంత భద్రత అక్కడ ఉండటం ప్రధాన ఆకర్షణ. కుటుంబాలకు అనువైన దేశం కూడా.

Advertisement

మహిళలు-ఎల్‌జీబీటీక్యూ వర్గాలకు సమాన హక్కులు కల్పించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహకరించుకునే స్వభావం, సామాజిక ఐక్యతను పెంచుతోంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలు అక్కడి ప్రజలకు మరింత భరోసా. ఈ ఏడాది ర్యాంకింగ్ లో ఐస్‌లాండ్ 1.161 స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

ALSO READ: రన్నింగ్ ఫ్లైట్ నుంచి దూకి ఇన్‌స్ట్రక్టర్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఆకాశంలో ఏం జరిగింది?

ఆసియాలో సింగపూర్-జపాన్‌లకు చోటు- న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, ఐర్లాండ్ వంటి దేశాలు రెండు నుండి ఐదవ స్థానాలలో నిలిచాయి. ఆస్ట్రియా, పోర్చుగల్, సింగపూర్, ఫిన్లాండ్, జపాన్ ఆరవ నుండి పదో ప్లేస్ లో నిలిచాయి. ప్రపంచ శాంతి ర్యాంకింగ్‌లలో ఐరోపా దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత శాంతియుతమైన 10 దేశాలలో సింగపూర్, జపాన్‌లకు చోటు దక్కింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×