E-Paper
Advertisement

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి

Africa: ఆఫ్రికాలో తుఫాన్ బీభత్సం.. 100 మందికి పైగా మృతి
Advertisement

Africa: ఆఫ్రికాలోని మలావి దేశాన్ని ఫ్రెడ్జీ తుఫాన్ అతాలకుతలం చేస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ఇళ్లు కుప్పకూలిపోయాయి. దక్షిణ ఆఫ్రియా, మధ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో జనాలు కొట్టుకుపోయారు.

ఇప్పటి వరకు తుఫాన్ దాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 60 మృతదేహాలను గుర్తించామని.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. గాయపడిన వారిని బ్లాంటైర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

ఎక్కువగా మట్టి నివాసాలే ఉండడంతో వరదలు దెబ్బకు అన్నీ కూలిపోయి జనాలు ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×