E-Paper
Advertisement

Flight Accident : మరో విమానానికి ప్రమాదం.. ఈసారి రన్‌వే నుంచి..

Flight Accident : మరో విమానానికి ప్రమాదం.. ఈసారి రన్‌వే నుంచి..
Advertisement

Flight Accident : విమానాలు భయపెడుతున్నాయి. హాయిగా సాగిపోతుందనుకునే జర్నీ గాల్లో దీపంలా మారుతోందా? అహ్మదాబాద్‌లో జరిగిన ఘోరం మరిచిపోకముందే, వేర్వేరు చోట్ల ప్రమాద ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అమెరికాలోని బోస్టన్‌లో రన్‌వే పై నుంచి గ్రాస్ ల్యాండ్‌లోకి వెళ్లిపోయింది జెట్‌బ్లూ ఫ్లైట్.

అమెరికాలోని చికాగో నుంచి బోస్టన్‌కు వెళ్లింది జెట్‌బ్లూ 312 ఫ్లైట్. ల్యాండింగ్ సమయంలో సమస్య వచ్చింది. ఊహించని విధంగా రన్‌వే పైనుంచి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ఎందుకిలా జరిగింది? ప్రాబ్లమ్ ఏమిటనే కోణంలో ఆల్రెడీ దర్యాప్తు మొదలు పెట్టారు. బోస్టన్ విమానాశ్రయ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కార్యకలాపాలను నిలిపివేశారు. తాత్కాలికంగా ఎయిర్‌పోర్టును మూసివేశారు.

అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు జనాలు. మామూలుగానే ఫ్లైట్ జర్నీ అంటే చాలా మందికి భయం. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో కళ్లు మూసుకోవడం, గట్టిగా సీటును పట్టుకోవడం చేసే ప్రయాణికులు చాలామందే ఉంటారు. అలాంటిది.. ఇప్పుడు టేకాఫ్ అవుతుండగా బోయింగ్ విమానం కుప్పకూలడంతో ఇకపై ఫ్లైట్ జర్నీ అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే కేటగగిరి పెరిగిపోవచ్చని అంటున్నారు. ఇప్పటి నుంచి ఏ చిన్న ఘటన జరిగినా.. విమాన ప్రమాదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ తప్పకపోవచ్చు. ఈ బెదురు పోవాలంటే ఇంకెంత కాలం పడుతుందో.

Advertisement

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×