E-Paper
Advertisement

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి
Advertisement

Five People Killed, Several Injured During Foot Ball Match: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. జమైకా దేశంలోని కింగ్‌స్టన్‌లో ప్లెజెంట్ హైట్స్ వేదికగా జరుగుతున్న పుట్ బాల్ మ్యాచ్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలోకి ప్రవేశించి కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. కింగ్‌స్టన్ స్టేట్‌లో సోమవారం అర్ధరాత్రి కొంతమంది కలిసి పుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరిగిన కాసేపటికే దుండగులు కాల్పులు చేశారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు కర్ప్యూ విధించారు.

Advertisement

Also Read: మస్క్‌కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్‌ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు జమైకా కాన్ స్టాబులరీ ఫోర్స్ ఇన్‌ఫర్ మెషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అయితే ఈ కాల్పులకు కారణమైన ఐదుగురిలో నలుగురిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×