E-Paper
Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడా?.. వైట్ హౌస్ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడా?.. వైట్ హౌస్ క్లారిటీ
Advertisement

US President Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారనే వార్తలు మరోసారి వైరల్ అయ్యాయి. ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది. ట్రంప్ సజీవంగానే ఉన్నారని వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారు. శనివారం రాత్రి మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ బయట పోలీసుల కార్లు, అధ్యక్షుడి కాన్వాయ్ రోడ్డు బ్లాక్ చేసినట్లు నెట్టింట వీడియోలు చక్కర్లు కొట్టాయి. ట్రంప్ ఆసుపత్రిలో చేరారని, మరణించారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇది ఓల్డ్ వీడియో అని, రోడ్లు బ్లాక్ చేసినట్లు ఎలాంటి నిర్ధారణ లేదని అధికారులు తెలిపారు.

వైట్ హౌస్ క్లారిటీ

ఈ వదంతులపై స్పందిస్తూ.. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడు ట్రంప్ కంటే ఎక్కువగా పనిచేసిన అధ్యక్షుడు ఎవ్వరూ లేరన్నారు. ఈస్టర్ వారాంతంలో ఆయన వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్‌లో రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నారని పోస్టు పెట్టారు. సోషల్ మీడియోలో మతిలేని వాళ్లు అనవసరంగా పుకార్లు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు వైట్ హౌస్ బయట సెక్యూరిటీ అధికారుల ఫొటోలు పోస్ట్ చేశారు. ఇవి సాధారణంగా అధ్యక్షుడు లోపల ఉన్నప్పుడు భద్రత అంటూ పోస్టులు పెట్టారు.

గత ఏడాదిలో

Advertisement

గత ఏడాది ఆగస్టులో, అమెరికా అధ్యక్షుడు మూడు రోజుల పాటు బహిరంగంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. దీంతో “ట్రంప్ చనిపోయారు” అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడి చేతిపై గాయం, కాళ్ల వాపుతో ఉన్న ఇటీవలి కొన్ని ఫొటోలు బయటపడటంతో, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందా అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ బయటకు కనిపించకపోవడంతో వదంతలు వ్యాపించాయి.

ట్రంప్ ఆరోగ్యంపై పదే పదే

79 ఏళ్ల అధ్యక్షుడు ట్రంప్.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో ఇరాన్ తో యుద్ధం, తాజా పరిస్థితులపై పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఇరాన్ లో కూలిపోయిన యుద్ధం విమానం పైలెట్ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పైలెట్ త్వరలోనే కోలుకుంటారని ట్రంప్ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ విమానాలు పాల్గొన్నాయని, రెస్క్యూకు ముందు నుంచి అమెరికా పైలెట్ ఆచూకీని ట్రాక్ చేస్తుందని తెలిపారు. ఇరాన్ లో చిక్కు్కున్న అమెరికా పైలెట్ గొప్ప యోధుడన్నారు. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాలలో శత్రువులకు దూరంగా ఉన్నారన్నారు. గంటగంటకూ శత్రువులు అతడికి దగ్గరవుతున్నారన్నారు.

ఇరాన్ లో కుప్పకూలిన అమెరికా ఎఫ్-15ఈ

Advertisement

శుక్రవారం ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానంను ఇరాన్ కూల్చివేసింది. ఈ ఘటనలో అమెరికా పైలెట్ జెట్ నుంచి బయటపడ్డారు. ‘శత్రు పైలట్’ను పట్టించిన వారికి భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో అతడితో గాలింపు ముమ్మరం అయింది. పైలట్ ను రక్షించేందుకు సీఐఏ రంగంలోకి దిగింది. ఇరాన్ ను తప్పదారి పట్టించి అమెరికా పైలట్ ను కాపాడేందుకు ప్రణాళిక అమలు చేస్తుంది. అయితే ఇప్పటికే అమెరికా దళాలు పైలట్ ను రక్షించాయిని ప్రచారం జరుగుతోంది.

Also Read:  రాతియుగానికి ఇరాన్? ట్రంప్ హెచ్చరికతో వణికిపోతున్న ప్రపంచం!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×