E-Paper
Advertisement

Valentine’s Day Tax in Bali: పన్ను చెల్లిస్తేనే బాలిలోకి ఎంట్రీ..

Valentine’s Day Tax in Bali: పన్ను చెల్లిస్తేనే బాలిలోకి ఎంట్రీ..
Advertisement

Valentine’s Day Tax in Bali: వాలెంటైన్స్ డే నాడు విదేశీ టూరిస్టులకు ఇండొనేసియా వాత పెట్టింది. ప్రపంచ ప్రసిద్ధ టూరిస్ట్ డెస్టినేషనల్లో ఒకటైన బాలి ప్రావిన్స్‌లోకి ప్రవేశించాలంటే ఇక నుంచి పన్ను చెల్లించాల్సిందే.
బీచ్‌లు, ఎంతో అందమైన లాండ్‌స్కేప్‌లకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. నిరుడు జనవరి-నవంబర్ నెలల మధ్య 4.8 మిలియన్ల మంది టూరిస్టులు బాలిని సందర్శించారని అంచనా.

టూరిస్ట్ టాక్స్‌ను గత సంవత్సరం ప్రకటించగా.. బుధవారం వాలెంటైన్స్ డే నుంచి అమల్లోకి వచ్చింది. బాలితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించే విదేశీ పర్యాటకులకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. స్థానిక టూరిస్టులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

Advertisement

దేశంలోకి అడుగుపెట్టడానికి మునుపే ట్రావెలర్లు 9.6 డాలర్లను ‘లవ్ బాలి’ వెబ్‌సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి రాక ముందు బాలి జీడీపీలో 60 శాతం పర్యాటకరంగం నుంచే లభించేది. నిరుడు లక్ష మంది బాలిని సందర్శించారని అంచనా. వీరిలో అత్యధికులు ఇండియా, చైనా, సింగపూర్ దేశాల నుంచే విచ్చేశారు.
ఇండొనేసియా దీవుల పర్యావరణాన్ని, సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో ఈ పన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×