E-Paper
Advertisement

Elon Musk: 600 బిలియన్ డాలర్ల అపర కుబేరుడు.. ఎలాన్ మస్క్ మరో రికార్డు

Elon Musk: 600 బిలియన్ డాలర్ల అపర కుబేరుడు.. ఎలాన్ మస్క్ మరో రికార్డు
Advertisement

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలాన్ మస్క్ మరో రికార్డు సృష్టించారు.ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా అవతరించారు. ప్రపంచంలోని మొట్టమొదటి ట్రిలియనీర్ గా అవతరించేందుకు దూసుకుపోతున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓ విలువ పెరుగుతున్నట్లు వార్తలు రావడంతో మస్క్ సంపద అమాంతం పెరిగింది. ఒక్క రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం ఆదాయం 677 బిలియన్ డాలర్లకు చేరింది.

రెండు రోజుల్లోనే

నాలుగు నెలల క్రితం ఆగస్టులో స్పేస్‌ఎక్స్ విలువ 800 బిలియన్ డాలర్ల ఉండగా.. ప్రస్తుతం రెట్టింపు అయింది. మంగళవారం ఫోర్బ్స్ మ్యాగజైన్ రియల్-టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ సంపద కేవలం రెండు రోజుల్లో 498 బిలియన్ డాలర్ల నుంచి 677 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్పేస్‌ఎక్స్ భారీ వాల్యుయేషన్ తో మార్కెట్‌ పుంజుకుంది. స్పేస్‌ఎక్స్ లో మస్క్ 42 శాతం వాటా విలువ ఇప్పుడు 168 బిలియన్ డాలర్లకు చేరింది. టెస్లాలో ఆయనకు 12 శాతం వాటా ఉండగా.. ప్రస్తుతం దీని విలువ 197 బిలియన్ డాలర్లు.

Advertisement

అంతేకాకుండా, మస్క్ కు కొత్త స్టార్టప్ xAI ను ఎక్స్ తో విలీనం చేశారు. ఎక్స్ లో మస్క్ 53 శాతం వాటా ఉందని, దీని విలువ 60 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ అంచనా వేసింది. xAI విలువ కూడా పెరిగిందని, దాని విలువ 230 బిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా వేసింది.

భారత్ లో ముఖేష్

ఎలాన్ మస్క్ రెండో అత్యంత ధనవంతుడైన గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కంటే 425 బిలియన్ డాలర్ల కంటే ముందున్నారు. లారీ ఫేజ్ ఆస్తుల విలువ 252 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ ట్రాకింగ్ లో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆస్తుల విలువను సుమారు 111.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

Advertisement

Also Read: PM Modi in Jordan: జోర్డాన్ లో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా కారు డ్రైవ్ చేసిన యువరాజు

1.5 ట్రిలియన్ డాలర్ల ఐపీఓ

2026లో స్పేస్‌ఎక్స్ అసాధారణంగా 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఐపీఓ ప్రకటిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకు ఎక్కనుంది. 2019లో సౌదీ అరామ్‌కో 29 బిలియన్ డాలర్ల ఆఫర్, 2014లో చైనాకు చెందిన అలీబాబా 25 బిలియన్ డాలర్లతో స్టాక్ మార్కెట్ ల్యాండ్‌మార్క్‌లుగా ఉన్నాయి.

మస్క్ 700 బిలియన్ డాలర్లు చేరుకోవడానికి ఎంత సమయం పట్టదని విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ మస్క్ అవతరిస్తారని అంచనా వేస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×