E-Paper
Advertisement

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం ?
Advertisement

Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్ సీఎస్) తెలిపింది. కాగా.. భూకంప కేంద్రాన్ని 80 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

కాగా.. ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం రోజునే.. జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం రాగా.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. గడిచిన 8 సంవత్సరాల్లో ఈ భూకంపమే అక్కడ తీవ్రమైనదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 100 మంది మరణించగా.. 200 మందికిపైగా ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. భూకంపం అనంతరం పలు తీరప్రాంతాల్లో సునామీ కూడా సంభవించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×