E-Paper
Advertisement

Earthquake: భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి

Earthquake: భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
Advertisement

Earthquake: ఈ మధ్య కాలంలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ ప్రాంతాల్లో భూకంపాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఆ తరువాత పసిఫిక్ మహాసముద్రంలో ఉంన్న టోంగా దీవులలో కూడా భూమి కంపించింది. ఈరోజు ఉదయం పసిఫిక్‌ మహాసముద్రంలోని పపువా న్యూ గునియాలో కూడా భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అంతేకాకుండా భూ కంపం ప్రభావం వల్ల అక్కడ సునామీ వచ్చే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఈ ఘటనలను మరువక ముందే ఆసియా ఖండంలో మరోసారి భూకంపం వచ్చింది. ఈ రోజు మధ్యహ్నం పాకిస్థాన్‌లో భూకంపం వచ్చింది.

ALSO READ: మరోసారి ప్రకృతి ప్రకోపం

Advertisement

ఇస్లామాబాద్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూమికి 10 కి.మీ లోతులో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు సమాచారం.

ఒక్క సారిగా భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొద్దిసెపటి వరకు భూమి కంపిస్తూనే ఉంది. ఆ తరువాత పరిస్థితి సద్దుమనగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పాకిస్థాన్‌లో వచ్చిన భూకంపం వల్ల జమ్ముకశ్మీర్‌లో కూడా భూమి కంపించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×