E-Paper
Advertisement

Earthquake hits Japan : న్యూ ఇయర్ వేళ.. ప్రకృతి విషాదం..!

Earthquake hits Japan : జపాన్‌ వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి. వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ద్వీప దేశం అయిన జపాన్‌ వరుస భూకంపాలతో నూతన సంవత్సరం వేళ గజగజలాడి పోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూకంప లేఖినిపై 4.0 రెక్టార్ల తీవ్రత కంటే అధిక స్థాయిలో భూకంపం సంభవించింది. ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి.

Earthquake hits Japan : న్యూ ఇయర్ వేళ..  ప్రకృతి విషాదం..!
Advertisement

Earthquake hits Japan : జపాన్‌ వరుసగా 21 భూకంపాలతో వణికిపోయింది. దీనికి తోడు స్వల్పశ్రేణి సునామీ అలలు తీరాన్ని తాకాయి. వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ద్వీప దేశం అయిన జపాన్‌ వరుస భూకంపాలతో నూతన సంవత్సరం వేళ గజగజలాడి పోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూకంప లేఖినిపై 4.0 రెక్టార్ల తీవ్రత కంటే అధిక స్థాయిలో భూకంపం సంభవించింది. ఏకంగా 21 భూకంపాలు నమోదయ్యాయి.

ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో చాలా వీధుల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సునామీ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు రావచ్చనే హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 36 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచి పోయింది.

Advertisement

హోక్కాయిడో, నాగసాకిల మధ్య సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రధాన హైవేలను మూసి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇషికావాలోని ప్రధాన అణువిద్యుత్తు కేంద్రం మాత్రం ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో దాదాపు రిక్టార్‌ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో 13 మంది గాయపడగా.. ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉంది.

జపాన్ లో వచ్చిన భూకంపం 1983లో వచ్చిన సీ ఆఫ్‌ జపాన్‌ భూకంపంతో పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఈ భూకంపంలో 104 మంది పౌరులు మరణించారు. 324మంది తీవ్రంగా గాయపడ్డారు.జపాన్‌లో ఏటా సగటున 5 వేల చిన్నాపెద్దా భూకంపాలు వస్తుంటాయి. అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

Advertisement

జపాన్‌ పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉంటుంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో 450 వరకు అగ్నిపర్వతాలున్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్‌ నాలుగు కాంటినెంటల్‌ ప్లేట్స్‌ చర్యలతో సంబంధం కలిగి ఉంది.

ద పసిఫిక్‌,ద యురేసియన్‌, ద ఫిలిప్పీన్‌, ద నార్త్‌ అమెరికా ప్లేట్‌లు తరచూ కదులుతూ ఉంటాయి. దాంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్‌ ట్రెంచ్‌గా పిలుస్తున్న జపనీస్‌ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్‌ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×