E-Paper
Advertisement

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?
Advertisement

Iran President Masoud: ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియన్‌ రాజీనామా చేశారా? ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారా? తీసుకునేటట్లు అక్కడి పాలకులు చేశారా? అంతర్జాతీయ మీడియా ఆ విధంగా కథనాలు ఎందుకు వస్తున్నాయి? అధ్యక్షుడి కార్యాలయం ఆయన రాజీనామాను ఖండించిందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.ః

అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

Advertisement

ఐఆర్‌జీసీ బలగాల తీరుపై తీవ్ర అసంతృప్తితో అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియన్‌ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఇరాన్‌ పత్రిక వెల్లడించింది. అంతేకాదు రాజీనామా లేఖలో కీలక అంశాలపై హెచ్చరించినట్లు ప్రస్తావించింది.

యుద్ధం మొదలైన నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇరాన్‌ ప్రభుత్వ అధికారులను దూరంగా పెట్టినట్టు అందులో ప్రధాన ఆరోపణ. పెజష్కియాన్‌ రాజీనామాపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని, ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్లు ప్రస్తావించింది.చట్టపరంగా బాధ్యతలను పూర్తి చేయకుండా అడ్డుకుంటున్నారన్నది మరొక ఆరోపణ.

Advertisement

మీడియా ఆడుతున్న మైండ్ గేమ్.. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ

ఇరాన్ అధ్యక్షుడు రాజీనామాపై వస్తున్న వార్తలను అధ్యక్ష కార్యాలయం ఖండించింది. మీడియా కమ్యూనికేషన్స్‌ విభాగం డిప్యూటీ హెడ్‌ మెహదీ తబాతబాయి రియాక్ట్ అయ్యారు. అమెరికాతో చర్చలు జరుగుతున్న వేళ అంతర్జాతీయ మీడియా గేమ్స్‌ ఆడుతోందన్నారు. మరోవైపు ఇరాన్ మద్దతుదారుడు తుర్కీ ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది.

మరోవైపు ఇరాన్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘేర్‌ ఒప్పందాలపై నోరు విప్పారు. ఇరాన్‌ హక్కులను కాపాడని ఏ డీల్‌కు తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా ఇరాన్‌తో శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు మార్పులు సూచన చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

60 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి తెరిచేందుకు చర్యలున్నాయట. ట్రంప్‌ మాత్రం ఇరాన్‌ అణ్వాయుధాలు తయారీకి దూరంగా ఉండాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.అలాగే హర్మూజ్‌ జలసంధిపై కొన్ని మార్పులు చేసినట్టు అమెరికా మీడియా వార్తలు వస్తున్నాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×