// // Sheikh Hasina: బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష -->
E-Paper
Advertisement

Sheikh Hasina: బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష

Sheikh Hasina: బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష
Advertisement

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ అల్లర్ల ఘటనపై ఆ దేశ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధించింది. అల్లర్లు కేసుపై ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్‌లో గతేడాది అల్లర్లు చెలరేగి తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

హసీనాపై అనేక నేరాలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా అనేక నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. “షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు. ఆగస్టు 5న చంఖర్‌పుల్‌లో ఆరుగురు నిరసనకారులను ఆర్మీ కాల్చి చంపింది. హోంమంత్రిగా షేక్ హసీనా ఆదేశాలు జారీ చేయడంతో అన్యాయంగా విద్యార్థులు చంపబడ్డారు. ఈ హత్యలు ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలతో జరిగాయి. ఇలాంటి చర్యల ద్వారా హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు” అని కోర్టు అభిప్రాయపడింది.

Advertisement

గత ఏడాది బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. తిరుగుబాటుదారులు హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. చివరికి అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా దేశం విడిచి పరారయ్యారు. ఆమె దిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియోలో ప్రసంగాలు చేస్తున్నారు. కోర్టు తీర్పునకు ముందు ఆమె స్పందించారు.

అవామీ లీగ్ పై నిషేధం

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు ముందు బంగ్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అలాగే ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని తెలిపింది. హసీనా ఆగస్టు 2024లో దేశాన్ని విడిచారు. అనంతరం ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ ను డిమాండ్ చేసింది.

తీర్పుపై హసీనా ఏమన్నారంటే?

Advertisement

తీర్పు వెలువడే ముందు హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం అవామీ లీగ్ భాగస్వామ్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు తాము తీర్పుపై అప్పీల్ చేయబోమని చెప్పారు. ఈ తీర్పుపై హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆమె ఆరోపించారు. తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. న్యాయమూర్తులు సైతం కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు.

 

2024 బంగ్లా అల్లర్లు

జులై, ఆగస్టు 2024లో విద్యార్థుల నేతృత్వంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లను అణిచివేసేందుకు ఆర్మీని ఉపయోగించాలని హసీనా ప్రత్యక్షంగా ఆదేశించినట్లు ఆధారాలు ఉన్నాయని విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, జులై 15 నుంచి ఆగస్టు 5 మధ్య జరిగిన నిరసనలలో 1,400 మంది వరకు మరణించారు. వేలాది మంది భద్రతా దళాల కాల్పుల్లో గాయపడ్డారు. 1971 స్వాతంత్ర్య యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన అత్యంత దారుణమైన హింస ఇదేనని కోర్టు అభిప్రాయపడింది.

Also Read: Mexico Gen Z: మెక్సికోలో Gen-Z నిరసనలు.. నేపాల్ సీన్ రిపీట్ అవుతుందా?

ఢాకాలో ఉద్రిక్తత

కోర్టు తీర్పునకు ముందు హసీనా సోషల్ మీడియాలో స్పందించారు. ట్రైబ్యునల్ చర్యలు న్యాయపరంగా లేవన్నారు. ఈ తీర్పు ముందస్తు ముగింపు అని ఆరోపించారు. ఈ తీర్పు వెలువడడానికి ముందు బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 30 చోట్ల బాంబు పేలుళ్లు, 26 వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టినా, బాంబులు విసిరేందుకు ప్రయత్నించినా కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×