E-Paper
Advertisement

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్
Advertisement

Carnival Cruise Ship: లగ్జరీ క్రూయిజ్ షిప్‌ అంటే అందులో ప్రయాణించేవారు ఓ రేంజ్‌లో ఉంటారు. శుభ్రత విషయంలో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది  ఓ ట్రావెల్ చేసిన పని సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తోటి ప్రయాణికులతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ ఆమె తీరు అందరికీ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో-కార్నివాల్ క్రూయిజ్ లైన్స్‌కు చెందిన ఓ షిప్‌లో ఊహించని దృశ్యం కనిపించింది. షిప్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద డైనింగ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. తోటి ప్రయాణికులతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తోంది ఓ మహిళ. అందరూ విస్తుపోయేలా ఆమె చేసిన తీరు ఆశ్చర్య పరిచింది. పాదాన్ని పదే పదే గోక్కుని, శుభ్రం చేసుకోకుండా ఆ చేత్తో ఆహారం తినడం ఆ వీడియోలో కనిపించింది.

Advertisement

ఓ మహిళ ఏం చేసిందంటే-ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన  ఓ వ్యక్తి,  దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌ అయ్యింది. ప్రయాణాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సదరు మహిళ తీరుపై చర్చ జరుగుతోంది. సదరు  మహిళ తన చేతితో పాదంపై పదే పదే గోకడం, ఏమాత్రం సంకోచం లేకుండా ఆ చేత్తో పిజ్జా తీసుకుని తినడం కనిపించింది. ఈ తతంగాన్ని సదరు ప్రయాణికులు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

రెస్టారెంట్‌లో ఒకటే గోకుడు-ఈ వీడియోకు ఇప్పటివరకు 11 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఇదే మహిళకు సంబంధించిన మరో వీడియోలో సదరు యూజర్ మరొక పోస్ట్ చేశాడు. ఆమె ఏకంగా తినడానికి ఉపయోగించే ఫోర్క్‌తో తన పాదాన్ని గోక్కోవడం అందులో కనిపించింది. సీక్రెట్‌గా షూట్ చేసిన ఈ వీడియోకు సుమారు 7 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ రెండు వీడియోలను చూసి నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అందరూ కలిసి ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లో ఇలాంటి శుభ్రత గలవారు ఉంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటిది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. వీటిని చూసిన తర్వాత హోటల్ గదుల్లో, స్విమ్మింగ్ పూల్స్‌లో చెప్పుల్లేకుండా నడవకూడదని తెలుస్తోందని మరొక యూజర్ రాసుకొచ్చాడు.

ALSO READ: హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

ఈ లెక్కన అలాంటి షిప్‌ల్లో ట్రావెల్ చేస్తే అక్కడి రెస్టారెంట్లకు స్పూన్లు, ఫోర్కులు మనం తీసుకెళ్లాలేమోనని మరొకరు వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఆ ఫోర్క్‌ను పారేయమని చెప్పకపోతే రేపటి రోజున మనం తినాల్సి రావచ్చని మరో యూజర్ మాట. మొత్తానికి లగ్జరీ క్రూయిజ్ లో సదరు మహిళ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×