E-Paper
Advertisement

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 15 మంది దుర్మరణం, ఎన్నికల అభ్యర్థులతోపాటు రాజకీయ నేతలు
Advertisement

Plane Crash: ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం మహారాష్ట్రలో విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకుందే మరొక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది.

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం

Advertisement

కొలంబియాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో కుకుటా సిటీ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి. ఆ విమానంలో దాదాపు 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమానం సిబ్బంది ఉన్నారు. ఆదేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒకానా సిటీలో ల్యాండ్ కావాల్సివుంది. ఫ్లైట్ కూలిన ప్రాంతం వెనిజువెలాకు సరిహద్దున ఉంది.

ఆ ప్రాంతం పర్వతాలతో కూడి ఉండడం ఒకటైతే, వాతావరణం సరిగ్గా లేకపోవడం మరొక కారణం. ఆ విమానంలో ఆ దేశానికి చెందిన శాసనసభ్యుడు ఉన్నాడు. సటేనా ఫ్లైట్ 8895గా గుర్తించారు అధికారులు. మృతుల్లో కొలంబియా ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కార్లోస్ సాల్సెడో ఉన్నారు. వీరిద్దరు తమ టీమ్‌తో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

రాజకీయ నేతలతోపాటు పలువురు మృతి

ఆదేశ ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా విమానాన్ని లీజుకు తీసుకుంది. ఈ విమానం కుకుటా నుండి బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో ఒకానాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయింది. అయితే విమానం మిస్సయిన ప్రాంతంలో దానికి సంబంధించిన శిథిలాలు కనుగొనబడ్డాయి. దీంతో విమానంలోని నేతలు, ప్రయాణీకులు, సిబ్బంది మరణించారని అధికారులు ధృవీకరించారు.

ALSO READ: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×