E-Paper
Advertisement

Plane Crash in Colombia: ఘోర విమాన ప్రమాదం.. ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలి 100 మంది మృతి?

Plane Crash in Colombia: ఘోర విమాన ప్రమాదం.. ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలి 100 మంది మృతి?
Advertisement

Plane Crash in Colombia: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పుటుమాయో ప్రావిన్స్‌లో కొలంబియా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ విమానంలో 100 మందికి పైగా సైనికులు, సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం విమానం మంటల్లో కాలిపోతున్న భీకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విషాద ఘటనపై కొలంబియా డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో సాంచేజ్ స్పందించారు. టేకాఫ్ సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తి విమానం క్రాష్ అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక దళాలు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న 100 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Advertisement

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల వల్ల లేదా ఇంజిన్ వైఫల్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ ఘటనతో కొలంబియా రక్షణ శాఖ దిగ్భ్రాంతికి గురైంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×