// // Iran Vs America-Israel War: గల్ఫ్‌లో యూఎస్ స్థావరాల గుట్టు.. ఇరాన్‌కి ఇచ్చిన చైనా స్టార్టప్ కంపెనీ -->
E-Paper
Advertisement

Iran Vs America-Israel War: గల్ఫ్‌లో యూఎస్ స్థావరాల వివరాలను ఇరాన్‌కి ఇచ్చిన చైనా స్టార్టప్ కంపెనీ, ఇదిగో వీడియో

Iran Vs America-Israel War: గల్ఫ్‌లో యూఎస్ స్థావరాల వివరాలను ఇరాన్‌కి ఇచ్చిన చైనా స్టార్టప్ కంపెనీ, ఇదిగో వీడియో
Advertisement

Iran Vs America-Israel War: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌లు మెరుపు దాడుల వెనుక ఏం జరుగుతోంది? ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా టెక్నాలజీ ఆధారంగా జరుగుతోందా? తాము ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాల నుంచి దాడులు చేస్తున్నాయా? ప్రస్తుతం ఇరాన్‌పై అదే జరుగుతోందా? యుద్దం ఇంకా నాలుగైదు వారాలు పట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకన్నారు? గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాల మ్యాప్‌ని ఇరాన్‌కు ఓ చైనీస్ కంపెనీ అందజేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్ చేతిలో గల్ఫ్‌లో యూఎస్ స్థావరాలు

Advertisement

ఇరాన్‌పై యుద్ధం మరో నాలుగైదు వారాల్లో ముగుస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నాడంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారాల తరబడి జరగనున్న దాడుల గురించి కీలక సమాచారాన్ని ఓ చైనా స్టార్టప్ కంపెనీ ఒకటి ఇరాన్ చేతికి ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేసినప్పుడు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.

మధ్యధరా, అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికన్ యుద్ధ విమానాల గురించి సున్నితమైన సమాచారాన్ని విడుదల చేసింది. అందులో ప్రతి రన్‌వే పొడవు, ఎక్కడెక్కడ ఏయే ఆయుధ డిపోలు డిపో, ఇరాన్ వైపు ఎక్కుపెట్టిన మిస్సైళ్లు, వార్ షిప్‌ల గురించి ప్రతీ సమాచారం అందులో ఉంది. ఈ వివరాలు వార్ మొదలు కావడానికి ముందే స్టార్టప్ కంపెనీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

గుట్టు బయటపెట్టిన చైనా స్టార్టప్ కంపెనీ.. ఆపై ఇరాన్‌ చేతికి 

ఇరాన్ సమీపంలో యుద్ధనౌకలను మోహరించడం ప్రారంభించినప్పటి నుండి డీటేల్స్ బయటకు వచ్చాయి. ఇరాన్‌పై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ మోహరించిందనే దానికి సంబంధించి హై-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది మిజార్‌ విజన్. మధ్యధరా సముద్రంలో US ఫోర్డ్ విమానం, అరేబియా సముద్రంలో అబ్రహం లింకన్ వార్ షిప్, ఖతార్ లోని ఉదీద్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఓవ్డా ఎయిర్ ఫోర్స్ బేస్, సౌదీ అరేబియాలో సౌదా బే నావల్ బేస్, డియాగో గార్సియా, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లను అందులో చూపుతోంది.

చైనా తన నిఘా సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నప్పటికీ దక్షిణ చైనా సముద్ర వ్యూహాత్మక పరిస్థితులను చిత్రాలను చైనా ఉపగ్రహాల నుండి కాకుండా అమెరికన్ ఉపగ్రహాల నుండి తీసుకోబడినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు రాసుకొచ్చింది. టెక్ యుగంలో ఈ రకమైన నిఘాను దాచడం కష్టమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వార్ నేపథ్యంలో చైనా నిఘా కార్యకలాపాలను బలోపేతం చేయగలదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: గల్ఫ్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ కన్ను.. ఆపై డ్రోన్ల దాడి

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×