// // Strait of Hormuz: మా విషయాల్లో వేలు పెడితే.. మడతెట్టేస్తాం, అమెరికాకు చైనా డెడ్లీ వార్నింగ్ -->
E-Paper
Advertisement

మా విషయాల్లో వేలు పెడితే.. మడతెట్టేస్తాం, అమెరికాకు చైనా డెడ్లీ వార్నింగ్

మా విషయాల్లో వేలు పెడితే.. మడతెట్టేస్తాం, అమెరికాకు చైనా డెడ్లీ వార్నింగ్
Advertisement

Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని అమెరికా దిగ్భంధం చేయడం కొత్త మలుపు తిరిగిందా? ఇరాన్ వార్ కాస్త చైనా వైపు మళ్లిందా? అమెరికా తీరుపై చైనా ఎందుకు భగ్గుమంది? ఈ నేపథ్యంలో ఘాటు వార్నింగ్ ఇచ్చిందా? చైనా హెచ్చరిక నేపథ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందా?

హర్మూజ్‌ జలసంధిని అమెరికా దిగ్భంధం.. చైనా డెడ్లీ వార్నింగ్

Advertisement

హర్మూజ్‌ జలసంధిలో అన్నినౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటన చేయడం, షిప్‌లను అమెరికా నేవీ విభాగం అడ్డుకోవడం మొదలైంది. దీనిపై అగ్గి మీద గుగ్గిలం అయ్యింది చైనా. ఈ క్రమంలో అమెరికాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది చైనా. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీనిపై చైనా రక్షణమంత్రి అడ్మిరల్‌ డాంగ్‌ జున్‌ ఘాటు హెచ్చరికలు చేశారు.

ప్రపంచంలో శాంతి-స్థిరత్వానికి తాము కట్టుబడి ఉందని తేల్చేశారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకా రవాణా సాగాలని పిలుపు నిచ్చారు.

Advertisement

మా విషయాల్లో వేలు పెడితే.. మడతెట్టేస్తాం అంటూ అమెరికాకు చైనా హెచ్చరిక

ఇరాన్‌‌తో తాము కుదుర్చుకున్న వాణిజ్య-ఇంధన ఒప్పందాలను బీజింగ్‌ గౌరవిస్తుందని తేల్చేశారు. ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జలసంధి నియంత్రణ ఇరాన్‌‌ చేతుల్లో ఉందని, చైనా నౌకలకు అది ఎప్పుడూ తెరిచే ఉంటుందని స్పష్టంచేశారు. యుద్ధం విషయంలో చైనా విదేశాంగశాఖ తన మద్దతును పునరుద్ఘాటించింది.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటలకు అమెరికా నేవీ దిగ్బంధనం ప్రారంభమైన సమయంలో చైనా నుంచి ఈ ప్రకటన వెలువడింది. జలమార్గం బీజింగ్‌కు అత్యంత కీలకమైనది, చమురు అవసరాలలో దాదాపు 40 శాతం, ఎల్ఎన్జీ అవసరాల్లో 30 శాతం సరఫరా చేస్తుందన్నారు. గల్ఫ్‌లోని ఈ కీలకమైన జలమార్గాన్ని సురక్షితం చేసుకోవడానికి చైనా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తోందని గుర్తు చేశారు.

ALSO READ: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు! ఈసారి జెనీవా వేదికగా, వీలైతే ఈ వారంలో భేటీ!

ఇరాన్ ఘర్షణ విషయంలో చైనా-అమెరికాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఫిబ్రవరి 28న ఘర్షణలు మొదలైన నుంచి ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా చేసిన దాడిని బీజింగ్ ఖండించింది.  సార్వభౌమాధికారం కలిగిన నాయకుడిని దారుణంగా హత్య చేయడం, పాలన మార్పు కోసం ప్రేరేపించడం ఆమోదయోగ్యం కాదని చైనా ప్రభుత్వ ఆధీనంలోని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.

తమ ప్రయోజనాలకు విరుద్ధంగా బీజింగ్.. ఇరాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సంక్లిష్టతలు తలెత్తుతాయని అమెరికా గతంలో వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో టెహ్రాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తే 50 శాతం సుంకాలు విధిస్తామని చైనాను హెచ్చరించారు ట్రంప్. ఇరాన్‌కు వాయు,రక్షణ వ్యవస్థలను పంపడానికి సన్నాహాలు చేస్తోందంటూ యూఎస్ నిఘా సంస్థలు అంచనా వేశాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×