// // Mossad Agent in Iran: ఇరాన్ ను నమ్మించి గొంతు కోసిన మ‌హిళ‌.. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ విధ్వంసం? -->
E-Paper
Advertisement

Mossad Agent in Iran: ఇరాన్ ను నమ్మించి గొంతు కోసిన మ‌హిళ‌.. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ విధ్వంసం?

Mossad Agent in Iran: ఇరాన్ ను నమ్మించి గొంతు కోసిన మ‌హిళ‌..  ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ విధ్వంసం?
Advertisement

Mossad Agent in Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ క్యాథరిన్ పెరస్ షెక్టర్ పేరు మరోసారి అంతర్జాతీయ మీడియాలో మారుమోగిపోతోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థల్లోకి.. ఆ దేశ అత్యున్నత నాయకత్వంలోకి ఒక జర్నలిస్టుగా ప్రవేశించి కీలక రహస్యాలను సేకరించిన ఆమె ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. బ్రిటీష్ పౌరసత్వం ఉన్నప్పటికీ ఆమె మూలాలు ఫ్రాన్స్‌లోని ఒక యూదు కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. సైకాలజీ, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మాస్టర్స్ చేసిన క్యాథరిన్ అత్యంత తెలివైన గూఢచారిగా పేరుగాంచారు. ఆమెను ‘బ్లాక్ విడో’ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తారని సమాచారం. ఆమె ఒక మొసాద్ ఏజెంట్ అనే ప్రచారం ఉన్నప్పటికీ, క్యాథరిన్ మాత్రం తాను కేవలం ఇరాన్ వాస్తవాలను వెలికితీసేందుకే ముస్లిం ముసుగు ధరించానని చెబుతుంటారు.

క్యాథరిన్ ఇరాన్ లోకి ప్రవేశించడానికి ఎంచుకున్న మార్గం అత్యంత సాహసోపేతమైంది. యెమన్‌లో ఐరాస (UN) అడ్వైజర్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక యెమనీ వ్యక్తిని వివాహం చేసుకుని షియా ముస్లిం మతంలోకి మారారు. ఈ మత మార్పిడి ఆమెకు ఇరాన్ లోకి సులభంగా ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రిపోర్టింగ్ చేయడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఇరాన్ అధికారుల నమ్మకాన్ని ఆమె వేగంగా చూరగొన్నారు. తాను యూదు మహిళనని తెలిసినా.. ఒక ముస్లింను పెళ్లి చేసుకోవడంతో ఇరాన్ నిఘా వర్గాలు కూడా ఆమెను అనుమానించలేకపోయాయి. ఇది ఆమెకు ఇరాన్ ప్రభుత్వంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో భేటీ అయ్యే అవకాశాన్ని ఇచ్చింది.

Advertisement

2017లో రష్యన్ వార్తా సంస్థ ‘ఆర్టీ’ (RT) కోసం పనిచేస్తున్న సమయంలో క్యాథరిన్ తన ప్రభావాన్ని మరింత పెంచుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాండిల్ చేసే స్థాయికి ఆమె చేరుకోవడం విశేషం. కుత్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సోలేమానీ.. మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ వంటి అగ్రనేతలతో ఆమె పలుమార్లు భేటీ అయ్యారు. ఒక విదేశీ మహిళ.. అది కూడా యూదు మూలాలున్న వ్యక్తి ఇరాన్ అత్యున్నత రహస్యాలను పర్యవేక్షించే స్థాయికి వెళ్లడం ఇరాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆమె ఇరాన్ రాజకీయాల్లో తన పట్టును కొనసాగించారు.

ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న ఖచ్చితమైన దాడుల వెనుక క్యాథరిన్ సేకరించిన సమాచారమే ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఆమె సేకరించిన ఇరాన్ సైనిక స్థావరాల మ్యాపులు.. అధికారుల కదలికలు.. రహస్య బంకర్ల వివరాలు ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF) ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముస్లిం ముసుగులో ఆమె చేసిన గూఢచర్యం ఇరాన్ కోటను లోపలి నుంచే బలహీనపరిచింది. ఒక మహిళ తన తెలివితేటలతో ఒక దేశం మొత్తం భద్రతా వ్యవస్థను ఎలా బురిడీ కొట్టించవచ్చో క్యాథరిన్ ఉదంతం నిరూపిస్తోంది.

Advertisement

Read Also: Iran Ship IRIS Dena: శ్రీలంక తీరంలో ఇరాన్‌ నౌకపై అమెరికా దాడి.. 101 మంది మంది మృతి!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×