E-Paper
Advertisement

Bus Plunges into Ravine : లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి

Bus Plunges into Ravine : లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి
Advertisement

Bus Plunges into Ravine in Peru : సౌత్ అమెరికాలోని పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి 25 మంది మృతి చెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. బస్సు సుమారు వెయ్యి అడుగుల లోతైన లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా అన్నదానిపై క్లారిటీ రాలేదు. బస్సు ప్రయాణికులతో తయాబాంబా నుంచి లిమాకు వెళ్తుండగా.. ఉత్తర పెరువియన్ జిల్లా కుస్కాలో ప్రమాదానికి గురైంది.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి సమయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. అర్థరాత్రి కాజామార్కాలోని ఆండియన్ ప్రాంతంలోని రోడ్డు గుంతలుగా ఉండటంతో.. బస్సు లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also Read : కెన్యాలో ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 42 మంది మృతి

బస్సు లోయలో ఉన్న నదిలో పడగా.. ప్రయాణికుల్లో కొందరు నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై సంతాపం తెలుపుతూ.. సెలెండిన్ మున్సిపాలిటీ 2 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. గతేడాది సౌత్ అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో 3100 మంది మరణించారు. అలాగే 2023 జనవరిలో పెరూలోనే కొండపై నుంచి బస్సు పడిపోవడంతో 24 మంది మరణించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×