E-Paper
Advertisement

Brazil airplane crashed: బ్రెజిల్‌లో ఘోరం.. 61 మంది మృతి..

Brazil airplane crashed: బ్రెజిల్‌లో ఘోరం.. 61 మంది మృతి..
Advertisement

Brazil airplane crashed: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మంది మృతి చెందారు. సావోపువాలోలోని నివాస ప్రాంతం విన్ హెడోలోలో ఈ ఘటన జరిగింది.

మరణించినవారిలో 57 మంది ట్రావెలర్స్, మరో నలుగురు విమాన స్టాప్ ఉన్నారు. ఈ విమానం బ్రెజిల్‌లో పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుండి బయలుదేరి సావో పువా‌లోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

Advertisement

విమానం కూలిపోయే ముందు ఆకాశంలో పలుమార్లు చక్కర్లు కొడుతూ ఆ తర్వాత కూలిపోయినట్టు కనిపించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. విమానం మంటల్లో దగ్ధమవుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ALSO READ:  గాజాతో చర్చలకు ఇజ్రాయిల్ ప్రధాని గ్రీన్ సిగ్నల్

Advertisement

బ్రెజిల్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విమానం కూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి ముందు రాడార్ నుంచి సిగ్నల్ కోల్పోయింది విమానం. కేవలం 17 వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం నిమిషం వ్యవధిలో భూమిపై కుప్పకూలింది.

విమానం ప్రమాదం గురించి తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు లుయూజ్ లులా డసిల్వా షాక్‌కు గురయ్యారు. కాసేపటికి తేరుకున్న ఆయన.. విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

2283 నెంబరు విమానంలో మొత్తం 61 మంది ఉన్నట్లు సంబంధిత ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 57 మంది ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్లు తెలిపింది.
అందులో ఉన్న అందరూ మరణించి ఉంటారని వెల్లడించింది.

 

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×