E-Paper
Advertisement

Boris Johnson : న్యూస్ రీడర్‌గా మారిన బ్రిటన్ మాజీ ప్రధాని!

Boris Johnson : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ‘జీబీ న్యూస్’ అనే ఓ యూకె టెలివిజన్ ఛానెల్‌లో ఆయన న్యూస్ ప్రెజెంటర్‌గా పని చేయబోతున్నారని ఆయన స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు

Boris Johnson : న్యూస్ రీడర్‌గా మారిన బ్రిటన్ మాజీ ప్రధాని!
Advertisement

Boris Johnson : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ త్వరలో ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ‘జీబీ న్యూస్’ అనే ఓ యూకె టెలివిజన్ ఛానెల్‌లో ఆయన న్యూస్ ప్రెజెంటర్‌గా పని చేయబోతున్నారని ఆయన స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

“రష్యా నుండి చైనా వరకు, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆ సవాళ్లన్నింటినీ మనం ఎలా ఎదుర్కొంటాం, మనకు ఎదురుగా ఉన్న భారీ అవకాశాల గురించి నేను ఈ అద్భుతమైన కొత్త టీవీ ఛానెల్‌కు నా స్పష్టమైన అభిప్రాయాలను అందించబోతున్నాను” అని బోరిస్ జాన్సన్ తన ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపారు.

Advertisement

ఇతర బ్రిటీష్ ఛానెళ్లకు భిన్నంగా ఫాక్స్ న్యూస్ వంటి యూఎస్ నెట్‌వర్క్‌ల మాదిరిగా వార్తలు, అభిప్రాయాలు, విశ్లేషణల మిశ్రమంతో జీబీ టీవీ ఛానెల్ 2021లో ప్రారంభమైంది. అయితే బ్రిటన్ బ్రాడ్‌కాస్టింగ్ వాచ్‌డాగ్ వివిధ సందర్భాలలో ‘జీబీ న్యూస్’ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది.

రాజకీయాల్లోకి రాకముందు బోరిస్ జాన్సన్ పలు మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఇంతకు ముందే బోరిస్ జాన్సన్ ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన ‘డైలీ మెయిల్’ అనే వార్తాపత్రికకు కాలమిస్ట్‌గా పనిచేశారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తి ఓ న్యూస్ ప్రెజెంటర్‌‌గా మారితే ఆ వార్తల విశ్లేషణను చూసే వారి సంఖ్య మామూలుగా ఉండదు.

Advertisement

2019లో యూకె ప్రధాన మంత్రి బాధ్యతుల చేపట్టిన బోరిస్.. 2022లో కొన్ని వివాదాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత యూకె ప్రధాని రిషి సునక్ కూడా బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

బోరిస్ జాన్సన్ 2024 ప్రారంభం నుంచి ప్రెజెంటర్, ప్రోగ్రామ్ మేకర్, వ్యాఖ్యాతగా తమ ఛానెల్‌లో పని చేస్తారని, వచ్చే ఏడాది బ్రిటన్ తో జరుగనున్నజాతీయ ఎన్నికలను కవర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని ‘జీబీ న్యూస్’ న్యూస్ తెలిపింది. అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే ఎన్నికలను కూడా కవర్ చేస్తారని పేర్కొంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×