E-Paper
Advertisement

Pakisthan Bomb Blast: పాకిస్థాన్ రైల్వే స్టేష‌న్ లో భారీ పేలుడు.. 20 మంది దుర్మ‌ర‌ణం!

Pakisthan Bomb Blast: పాకిస్థాన్ రైల్వే స్టేష‌న్ లో భారీ పేలుడు.. 20 మంది దుర్మ‌ర‌ణం!
Advertisement

Pakisthan: పాకిస్థాన్ లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌లూచిస్థాన్ లోని క్వెట్టా రైల్వే స్టేష‌న్ లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది మ‌ర‌ణించగా దాదాపు 40 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఒక రైలు ఫ్లాట్ ఫార‌మ్ నుండి పెషావ‌ర్ బ‌య‌లు దేర‌డానికి సిద్ధంగా ఉండ‌టంతో దాదాపు 100 మంది ప్రయాణికులు అక్క‌డ ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు క్వెట్టాలో ఒక‌దాని త‌ర‌వాత ఒక‌టి రెండు బాంబు పేలుళ్లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. మొద‌టి పేలుడులో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, రెండ‌వ పేలుడు ఘ‌ట‌న‌లో దాదాపు 15 నుండి 26 మంది మ‌ర‌ణించార‌ని స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌పై క్వెట్టా సీనియ‌ర్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్ ఆప‌రేష‌న్స్ మ‌హ్మ‌ద్ బలోచ్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలా ఈ ప్ర‌మాదం క‌నిపిస్తోంద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, త్వ‌ర‌లోనే నింధితులను ప‌ట్టుకుంటామ‌ని అన్నారు. బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ ఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాలు సేక‌రిస్తున్నందున వ‌చ్చిన‌ నివేధిక ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తామ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన ప్ర‌యాణికుల్లో కొంద‌రి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ లోని ప్రావిన్స్, బ‌లూచిస్తాన్ వేర్పాటువాద తీవ్ర‌వాదుల‌కు నిల‌యంగా మారాయి. గ‌తంలో కూడా ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయి.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×