E-Paper
Advertisement

New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వీధుల్లో భక్తుల ర్యాలీ..

New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్  వీధుల్లో భక్తుల ర్యాలీ..
Advertisement

New York : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా డోలు చప్పుళ్లు, భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. టైమ్స్‌ స్క్వేర్‌ విద్యుత్‌ బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

ప్రవాస భారతీయులంతా టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు పట్టుకొని వేడుకలు చేసుకుంటున్నారు. మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌ నగర మేయర్‌ జో పెట్టీ హిందూ సమాజానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో మేయర్ పాల్గొన్నారు.

Advertisement

ఈ సంధర్బంగా VHP అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాతూ.. “ఈరోజు చెప్పడానికి మాటలు లేవు. 25 తరాల బాధలు, సవాళ్లు, పోరాటం, త్యాగాలు, రామమందిరం, రాముడి ప్రాణ ప్రతిష్ఠలో వాటి ముగింపు. ఈ రోజు అద్భుతమైన రోజు” అని అన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×