E-Paper
Advertisement

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి
Advertisement

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో విమానం ప్రమాదం జరిగింది. రన్ వే పై విమానం కుప్పకూలింది. న్యూ సౌత్ వేల్స్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీకి 85 కి.మీ దూరంలో ఉన్న షెల్హార్‌బోర్ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.

“విమానం నేలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాపక విభాగం మంటలను అదుపుచేసింది” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తుంది.

పోలీసుల ఏమన్నారంటే?

Advertisement

న్యూ సౌత్ వేల్స్ పోలీసుల ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. నేలను వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. న్యూసౌత్ వేల్స్ అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రన్ వే పై కాలిపోయిన విమానం శిథిలాలు ఈ వీడియోల్లో కనిపించాయి.

రన్ వే పైనే ప్రమాదం

ఆ విమానం న్యూ సౌత్ వేల్స్‌లోని బాథర్స్ట్‌కు వెళ్తుంది. ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్‌ను ఆండ్రూ కానర్స్‌గా పోలీసులు గుర్తించారు. బయలుదేరిన తర్వాత తగినంత ఎత్తుకు విమానం చేరుకోలేక ఒక్కసారిగా రన్ వే పై కూలిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో తెలిపారు. రన్‌వేపై క్రాష్ అయిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఏటీఎస్బీ దర్యాప్తు

Advertisement

ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ATSB) దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. ఈ ఘటన విషాదకరమని చీఫ్ ఇన్‌స్పెక్టర్ వుండర్‌లిచ్‌ను మీడియాతో తెలిపారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తుస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నట్లు తెలిపారు.

Also Read: US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

ఫైర్ అండ్ రెస్క్యూ NSW ఇన్‌స్పెక్టర్ ఆండ్రూ బార్బర్ మీడియాతో మాట్లాడుతూ.. “తక్షణ సహాయం చేసేందుుకు విమానాశ్రయంలో ఆర్ఎఫ్ఎస్ యూనిట్ ఉన్నప్పటికీ విమానంలోని వారిని రక్షించే అవకాశం లేకపయింది. ఎయిర్ కాఫ్ట్ వేగంగా రన్ వే ను ఢీకొట్టడంతో ఇంధనం నుంచి మంటలు చెలరేగాయి” అని చెప్పారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×