E-Paper
Advertisement

Argentina LPG Gas: అర్జెంటీనాతో భారత్‌కు రిలీఫ్.. గ్యాస్ సరఫరాతో కాస్త రిలీఫ్, కాకపోతే జర్నీ కూడా

Argentina LPG Gas: అర్జెంటీనాతో భారత్‌కు రిలీఫ్..  గ్యాస్ సరఫరాతో కాస్త రిలీఫ్, కాకపోతే జర్నీ కూడా
Advertisement

Argentina LPG Gas: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నేపథ్యంలో చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ సహకారంతో హోర్మూజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలు భారత్‌కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాను కఠినతరం చేసింది భారత్. దేశం వంటగ్యాస్ అవసరాలు తీర్చుకోవడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంది.

పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు.. అర్జెంటీనా సాయంతో భారత్‌కు రిలీఫ్

Advertisement

భారత్ తన ఎల్‌పీజీ దిగుమతుల కోసం చాన్నాళ్లుగా గల్ఫ్‌ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. వివిధ నివేదికల ప్రకారం దాదాపు 90 శాతం చమురు సరఫరా ఈ ప్రాంతం నుంచి వస్తోంది. అందుకు గల్ఫ్ దేశాలు బాగానే అవకాశం ఇచ్చాయి. ఇరాన్‌తో అమెరికా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటి హోర్ముజ్ జలసంధి. దీని ద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఫలితంగా నౌకలు రావడానికి విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆయిల్ సరఫరాలో ఒత్తిడికి గురైంది భారత్. పరిశ్రమలు అంతరాయం ఎదుర్కొన్నాయి. చాలా పరిశ్రమలు చమురు లేక మూతపడిన సందర్భాలు ఉన్నాయి. తొలుత గృహ వినియోగదారులకు ఉండేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.

Advertisement

భారత్ కు గ్యాస్ సరఫరా చేసిన అర్జెంటీనా,  ఏషియా మార్కెట్‌పై కన్నేసింది

సంక్షోభ సమయంలో అర్జెంటీనా ప్రత్యామ్నాయ సరఫరాదారుగా మారింది. 2026 ఏడాది మొదలు అర్జెంటీనా నుండి భారత్‌కు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. జాతీయ మీడియా నివేదిక ప్రకారం మేరకు.. మూడు నెలల్లో భారత్‌కు సుమారు 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా చేసింది అర్జెంటీనా.

గతేడాది కేవలం 22 వేల టన్నులు. 2024కు ముందు అర్జెంటీనా నుండి భారత్ ఎల్‌పీజీ రవాణా అయ్యింది. సంఘర్షణ తీవ్రమైన తర్వాత అర్జెంటీనా చమురు పంపడం మొదలుపెట్టింది. ఆయిల్ సరఫరా అంతరాయాన్ని తగ్గించడంలో కీలకంగా సహాయపడింది. కొన్నాళ్లుగా అర్జెంటీనా కంపెనీలు చమురు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నాయి.

ప్రపంచ ఇంధన మార్కెట్లలో తమ ఉనికిని పెంచుకోవాలని భావిస్తున్నాయి. సరైన సమయంలో అర్జెంటీనా చమురు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అర్జెంటీనా పాత్ర ముఖ్యమైనదే అయినప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. గల్ఫ్ దేశాలతో పోలిస్తే దక్షిణ అమెరికా నుండి భారత్‌కు ఎల్‌పీజీ రవాణా కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ALSO READ: యుద్ధం ముగిసినా.. గ్యాస్ కష్టాలు నాలుగేళ్లు తప్పవా? ఏం జరిగింది?

సాధారణ దిగుమతులకు అర్జెంటీనా సమర్థవంతమైన ఎంపిక కాదు. మధ్యప్రాచ్యం సరఫరాలను భర్తీ చేయడానికి అర్జెంటీనా చాలా కీలకం. ఆ దేశాన్ని దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా కాకుండా వ్యూహాత్మక రక్షణ కవచం అన్నమాట.  అర్జెంటీనాలోని బహియా బ్లాంకా పోర్ట్ నుండి గుజరాత్‌లో దహేజ్ పోర్ట్‌కు దూరం దాదాపు 20 వేల కిలోమీటర్లు.

ఈ మార్గంలో చమురు నౌక రావడానికి నెలకు పైగానే పడుతుంది. అంటే 30 నుండి 35 రోజులు పడుతుందని ఓ అంచనా. అదే గల్ఫ్ దేశాల నుంచి కేవలం వారం లేకుంటే 10 రోజులు మాత్రమే పడుతుంది. ఎల్‌పీజీ కాకుండా హైడ్రోకార్బన్, లిథియం వంటి ఖనిజాల విషయంలో భారత్‌తో కలిసి తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత్‌‌లో అర్జెంటీనా రాయబారి మరియానో అగస్టిన్ కాసినో తెలిపారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×